FIFA Officials Arrested Over Alleged $150M Bribery Scheme

Fifa officials arrested on corruption charges

FIFA officials arrested on corruption charges, FIFA, Soccer, Corruption, World Cup, Sepp Blatter, football, corruption, indictment, arresSwiss authorities, FIFA officials arrested , soccer's international governing body, federal corruption investigation, US Department of Justice, sports news, sports articles

Swiss authorities arrested officials with FIFA, soccer's international governing body, in connection with a federal corruption investigation

150 మిలియన్ డాలర్ల అవినీతి కేసులో 6గురు ఫిఫా అధికారుల అరెస్ట్

Posted: 05/27/2015 06:29 PM IST
Fifa officials arrested on corruption charges

అవినీతి జాడ్యం అందుగలదు ఇందులేదు అన్న సందేహము వలదు.. ఎందెందు వెతికినా అందందు ప్రత్యక్షమగును అన్నట్లు అన్ని క్రీడలకీ ఇది వ్యాపించింది. తాజాగా ప్రపంచ ఫుట్బాల్ లోకి కూడా ఇది చోరబడింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్విట్జర్లాండ్ అధికారులు ఇవాళ ఆరుగురు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. పుట్ బాల్ క్రీడలో అత్యంత శక్తిమంతమైన, వేలాది కోట్ల రూపాయల ఆదాయంతో సుసంపన్నమైన ఫిఫాకు షాక్ తగిలింది. అవినీతి ఆరోపణలపై అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య సంఘం (ఫిఫా) అత్యున్నత స్థాయి అధికారులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారిస్తున్న అమెరికా న్యాయ విభాగానికి చెందిన అధికారులకు ఆరుగురు అధికారులను స్విట్జర్లాండ్ అధికారులు అప్పగించారు.

ఫిఫా ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జురిచ్లో ఉంది. జురిచ్లో జరిగిన ఫిఫా వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కార్యవర్గ సభ్యలు వచ్చారు. అమెరికా న్యాయశాఖ విన్నపం మేరకు స్విస్ అధికారులు అకస్మాత్తుగా ఫిఫా అధికారులు బస చేసిన హోటల్పై దాడి చేసి అరెస్ట్ చేశారు. గత రెండు దశాబ్దాలుగా ఫిఫాలో అవినీతి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రపంచ ఫుట్కప్ల నిర్వహణకు బిడ్లు, మార్కెటింగ్, ప్రసార హక్కుల ఒప్పందాలకు సంబంధించి ఫిఫా అధికారులు అవినీతికి పాల్పడినట్టు అభియోగాలు వచ్చాయి. అమెరికా విన్నపం మేరకు స్విస్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ కేసుపై దృష్టిసారించారు. కాగా ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్పై అభియోగాలు నమోదు చేయకున్నా అధికారులు ఆయనను విచారించనున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : FIFA  Football Association  FIFA Officials Arrest  Corruption Charges  

Other Articles