Chess wizard Viswanathan Anand | mother Sushila Viswanathan | passed away

Viswanathan anand s mother passes away

Viswanathan Anand's mother passes away, Sushila Viswanathan, Besant Nagar, P.R.Venkatarama Raja, President All India Chess Federation, badminton, cricket, golf, latest news of sports, soccer, sports, tennis, chess

Chess wizard Viswanathan Anand's mother Sushila Viswanathan has passed away in her sleep here. She was 79.

విశ్వానాథన్ ఆనంద్ కు మాతృవియోగం

Posted: 05/27/2015 06:36 PM IST
Viswanathan anand s mother passes away

ప్రపంచ చెస్ మాజీ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ కు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి సుశీలా విశ్వనాథన్ బుధవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆమె వయసు 89 ఏళ్లు. నిద్రలోనే ఆమె తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె అంత్యక్రియలు గురువారం నిర్వహించనున్నట్టు ఆనంద్ బంధువులు తెలిపారు. గురువారం బీసెంట్ నగర్ లోని స్మశాన వాటికలో అమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు. కాగా ఆమెకు భర్త  కె.విశ్వనాథన్, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. ఆనంద్ పెద్ద కొడుకు. కాగా చదరంగం క్రీడాలో మాజీ విశ్వ విజేతగా నిలిచిన ఆనంద్ కు ఆయన తల్లే తొలి గురువు.

ఆనంద్ కు చదరంగ క్రీడాలో సాధారణ కదిలకను నేర్పించింది అవిడే. ఆనంద్ కు క్రీడ పట్ల వున్న ఆసక్తి మేరకు ఆమె చదరంగంలో తొలి పాఠాలు ఆమె దగ్గరే నేర్చారు. ఆనంద్ ను పాఠశాల స్థాయి నుంచి విశ్వవిజేతగా నిలబెట్టే క్రమంలో అనేక చాంఫియన్ షిప్ లకు అమె ఆనంద్ కు తోడుగా వెళ్లి ప్రోత్సహించారు. ఆనంద్ సాధించిన ప్రతి విజయం వెనుక సుశీల విశ్వనాథన్ వున్నారు. సుశీలా విశ్వనాథన్  మృతిపై  ఆల్ ఇండియా ఛెస్ ఫెడరేషన్ అధ్యక్షుడు పిఆర్ వెంకట్రామ రాజా  సంతాపం తెలియజేశారు. విశ్వనాథన్ ఆనంద్ చదరంగంలో ఇంతటి ఘనత సాధించడంలో ఆయన తల్లి పాత్ర చాలా ఉందని ఆయన  కొనియాడారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Viswanathan Anand  Sushila Viswanathan  passed away  

Other Articles