Boxer mike tyson physically harassed by oldage man in newyork city streets

mike tyson, mike tyson news, mike tyson interview, mike tyson physically harassed, mike tyson wikipedia, mike tyson games, physically harassed cases, newyork city, newyork city news, newyork city streets

boxer mike tyson physically harassed by oldage man in newyork city streets

2మచ్ : మైక్ టైసన్ పై లైంగిక వేధింపులు!

Posted: 11/01/2014 01:28 PM IST
Boxer mike tyson physically harassed by oldage man in newyork city streets

మైక్ టైసన్... కండలు తిరిగిన ఒక గొప్ప పోరాటవీరుడు! అతని పేరు చెబితేనే భీకర సమరాలే ఎక్కువగా గుర్తుకొస్తాయి. ఇతను బాక్సింగ్ కోర్టులో దిగితే చాలు.. అవతలివారిని ఖచ్చితంగా మట్టుబెట్టి విజయకేతనం ఎగురవేస్తాడు. ఎంతోమంది పోరాటయోధులు కూడా ఇతనిని చూసి భయపడిపోతారు. తన కెరీర్ లో గెలుపు తప్ప ఓటమి ఎరుగని వీరుడతడు. అటువంటి టైసన్ కూడా వేధింపులకు గురయ్యాడట! తనకు జరిగిన ఆ సంఘటనతో అతడు చాలా బెదిరిపోయాడని.. భయంతో వణికిపోయాడని స్వయంగా అతనే పేర్కొనడం ఆశ్చర్యంగా వుంది. తన దేహబలంతో ఇతరులను శుద్ధిచేసే ఈ వీరుడు కూడా లైంగిక వేధింపులకు గురయ్యాడా? అంటూ అందరికీ ఒక్కసారిగా షాక్ తగిలేలా స్టేట్ మెంట్ ఇచ్చాడు. అయితే ఆ ఘటన జరిగింది ఇప్పుడు కాదులెండి.. అతడు 7వ ఏటలో వున్నప్పుడు!

మైక్ టైసన్ కి ఏడేళ్ల వయసున్నప్పుడు ఒకనాడు న్యూయార్క్ వీధుల్లో వెళుతుండగా ఒక పెద్దాయని అతడిని ఆపాడట! అప్పుడు అతను టైసన్ ను లైంగికంగా వేధించాడట! ఆ సమయంలో అతడు చాలా బెదిరిపోయాడని.. అతను పెట్టే ప్రలోభాలకు భయంతో వణికిపోయానని పేర్కొన్నాడు ఈ బాక్సర్! చిన్ననాటి ఆ సంఘటనను తానిప్పటికీ కూడా మరిచిపోలేనని చెబుతున్నాడు. ‘‘వీధిలో వెళుతున్నప్పుడు ఓ ముసలాయని నన్ను లైంగికంగా వేధించాడు. అప్పుడు చాలా భయపడ్డాను. ఆ తర్వాత అతన్ని ఎప్పుడూ చూడలేదు. కానీ ఆ అనుభవం ఎప్పటికీ వెంటాడుతూనే వుంటుంది’’ అని మైక్ వెల్లడించాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mike tyson  indian boxers  newyork city  physically harassed  telugu news  

Other Articles