Badminton star pv sindhu nominated pawan kalyan to participate in swachch bharat campaign

pv sindhu, pawan kalyan, swachch bharat campaign, pm narendra modi, mahatma gandhiji, tollywood heroes, tollywood actresses, kollywood heroes, kollywood actresses, pv sindhu news, pv sindhu latest news, pv sindhu matches, pv sindhu wiki, pawan kalyan latest news, pawan kalyan news, pawan kalyan movie updates, jwala gutta, leander paes

badminton star pv sindhu nominated pawan kalyan to participate in swachch bharat campaign

పవన్ కల్యాణ్ ను ఛాలెంజ్ చేసిన పివి సింధు..?

Posted: 11/03/2014 04:05 PM IST
Badminton star pv sindhu nominated pawan kalyan to participate in swachch bharat campaign

భారతతీయ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు.. తాజాగా పవన్ కల్యాణ్ ను ఛాలెంజ్ చేసింది. తాను చేసిన కార్యక్రమంలో భాగంగా పవన్ కూడా పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చింది. ఇటీవలే భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన ‘‘స్వచ్ఛ భారత్’’ కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే! ఆనాడు ఆయన ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ కొంతమంది రాజకీయ, సినీ ప్రముఖుల్ని అందులో పాల్గొనాల్సిందిగా ఆయన నామినేట్ చేశారు. అలా ఒక్కొక్కరు నామినేట్ చేసుకుంటూ ఈ ‘‘స్వచ్ఛ భారత్’’ కార్యక్రమంలో పాల్గొంటూ దేశపరిశుభ్రతలో భాగంగా పాలుపంచుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది.

శనివారం సౌత్ సెంట్రల్ రైల్వే – సికింద్రాబాద్ డివిజన్ ప్రారంభించిన ‘‘స్వచ్చ భారత్’’ యాత్రలో సింధు పాల్గొంది. ఇతరులతోపాటు ఆమె కూడా చీపురుపట్టి హైదరాబాద్ లో లింగంపల్లి రైల్వే స్టేషన్ ఆవరణను శుభ్రం చేసింది. అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ‘‘స్వచ్చ భారత్’’ కాంపెయిన్ లో పోల్గోనాల్సిందిగా ఛాలెంజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నిజమైన దేశభక్తి పరిశుభ్రతలోనే వుందని ఆనాడు గాంధీజీ చెప్పారు. మనదేశం పరిశుభ్రంగా వుంచడానికి గాంధీజీ మాటలను ప్రతిఒక్కరూ ఆచరిస్తారని నేను ఆశిస్తున్నాను. పవన్ కళ్యాణ్, జ్వాలా గుత్తా, లియాండర్ పేస్ లను ఈ ‘స్వచ్చ భారత్’లో కాంపెయిన్ లో పోల్గోనాల్సిందిగా నామినేట్ చేస్తున్నాను’’ అని సింధు పేర్కొంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pv sindhu  pawan kalyan  jwala gutta  narendra modi  swachch bharat  

Other Articles