Spain crash out of fifa world cup

Spain Crash Out of FIFA, FIFA world cup, Spain, Summits, General news, Brazil, Rio de Janeiro, Argentina, Chile

Spain famed passing game failed against a tenacious Chile team, its era ending in the storied Maracana filled mostly with noisy Chilean sunpporters.

అంచనాలు తలకిందులు... ఇంటిదారి పట్టిన స్పెయిన్

Posted: 06/19/2014 05:01 PM IST
Spain crash out of fifa world cup

ఫిఫా వరల్ఢ్ కప్ కి ముందు గత వరల్డ్ కప్ ఛాంపియన్ అయిన స్పెయిన్ ఈ సారి కూడా కప్ గెలుస్తుందని అంతా అంచనా వేశారు. ఇప్పుడు అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కనీసం నాకౌట్ దశకు కూడా చేరుకోలేక పోయింది. సముద్రపు జీవుల జోస్యాలు, జంతుల జోస్యాలు ఏవీ నిజం కాలేదు. నిన్నటికి నిన్న ఛిలీ, స్పెయిన్ మ్యాచ్ కి ముందు ఒంటె స్పెయిన్ గెలుస్తుందని చెప్పింది. కానీ తీరా ఫలితం తారు మారు అయ్యింది. దానికి తోడు ఈ వరల్డ్ కప్ లో కూడా చరిత్ర పునరావృతం అయ్యింది.

ఇంత వరకు డింపెండ్ ఛాపింయన్ నాకౌట్ చేరిన సందర్భాలు లేవు. ఇప్పుడు అదే జరిగింది. తొలి లీగ్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై ఘోర పరాజయం పాలైన స్పెయిన్ రెండో మ్యాచ్ లోనైనా పుంజుకుంటుందని అనుకున్నారు. కానీ చిలీతో జరిగిన మ్యాచ్ లో 2-0 తేడాతో ఓడి ఇంటి ముఖం పట్టింది. స్పెయిన్ పై విజయంతో చిలీ నాకౌట్ దశకు  చేరుకొని ఔరా అనిపించుకుంది. నిన్న హోరా హోరీగా సాగిన మ్యాచ్ లో సాగిన మ్యాచ్ లో తొలి అర్ధ భాగంలోనే రెండు గోల్స్ సాధించి చిలీ ఆధిక్యాన్ని సంపాదించుకుంది.

20వ నిమిషంలో వర్గాన్ తొలి గోల్ సాధించగా, 43 వ నిమిషంలో అరాన్ గెజ్ మరో అద్భుతమైన గోల్ సాధించిచాడు. రెండో భాగంలో స్పెయిన్ గోల్ కోసం ప్రయత్నాలు చేసినా చిలీ ఆటగాళ్ళు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో స్పెయిన్ కథ కంచికి చేరింది. మరి ఇప్పటికైనా ఈ జంతువుల జోస్యాలు , జట్ల గెలులు ఓటముల పై చెప్పడం మానేస్తే ఈ మూఢ నమ్మకాలను  ఫుల్ బాల్ అభిమానులు నమ్మకుండా ఉంటారు, బెట్టింగులు పెట్టేవారు పెట్టరు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles