Sachin son a probable witness preity zinta case

Sachin son a probable witness Preity Zinta case, arjun tendulkar,ness wadia,preity zinta,preity zinta ness wadia case,preity zinta ness wadia controversy,preity zinta ness wadia molestation

Sachin Tendulkar minor son Arjun Tendulkar may have his statement recorded by Mumbai Police in connection with actor Preity Zinta harassment complaint against Wadia Group scion Ness Wadia.

ప్రీతి జింతా కేసులో కీలక సాక్షిగా సచిన్ కొడుకు

Posted: 06/20/2014 03:47 PM IST
Sachin son a probable witness preity zinta case

పిల్లికి ఎలుక సాక్ష్యం మాదిరి గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా మారిన బాలీవుడ్ నటి ప్రీతి జింతా, నెస్ వాడియా వివాదంలోకి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ ని లాగినట్లే కనిపిస్తుంది. ఇప్పటికే రోజుకో మలుపు తిరుగుతూ ఉన్న ఈ కేసులో సాక్షిగా అర్జున్ వాంగ్మూలాన్ని తీసుకొని రికార్డు చేసేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. నెస్ వాడియా.. ప్రీతిజింతాను దుర్భాషాలాడిన సమయంలో అర్జున్ టెండుల్కర్ అక్కడే ఉన్నాడని, ప్రీతినే కాకుండా అర్జున్ పై కూడా వాడియా నోరు పారేసుకున్నాడని అంటున్నారు.

గతంలో కీలక సాక్షిగా భావించిన వ్యక్తి దగ్గర్నుండి సరైన సమాధానం రాకపోయే సరికి ఆ ప్రక్కనే ఉన్న అర్జున్ వాంగ్మూలాన్ని తీసుకొని కేసులో నిజానిజాల్ని నిగ్గు తేల్చేపనిలో పడ్డారట. మరోవైపు, తన స్టేట్‌మెంట్‌ను ఈ వారాంతంలో రికార్డ్ చేయమని ముంబై పోలీసులకు ప్రీతిజింతా తెలిపింది. కాగా, ఐపిఎల్ ఫ్రాంచైజ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లో తన వాటాను అమ్మే ప్రసక్తి లేదని ప్రీతిజింతా ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. నెస్ వాడియాతో తలెత్తిన వివాదం విషయంలో తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. మరి ఈ వివాదం ఎప్పుడు కొలిక్కి వస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles