Jennifer lopez exit from world cup opening

Jennifer Lopez exit from World Cup opening, jennifer lopez, jlo, jennifer lopez world cup, jennifer lopez pitbull,jennifer lopez claudia leitte,

Singer rep cites unspecified production issues as reason for cancelling her performance of official song.

జెలో ఫిపా వేడుకలకు రావడం లేదు

Posted: 06/10/2014 12:43 PM IST
Jennifer lopez exit from world cup opening

మరో 48 గంటల్లో ప్రపంచ వ్యాప్త అభిమానులు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న ‘ఫిఫా ’ వరల్డ్ కప్ ప్రారంభోత్సరం కాబోతుంది. ఫిఫా వరల్డ్ కప్ అంటే పడి చచ్చే అభిమానులు ఆ టోర్నీ ప్రారంభోత్సవం రోజు పాడే పాట కోసం అంతే ఆత్రంగా ఎదురు చూస్తారు. గత వరల్డ్ కప్ కి పాప్ సింగర్ షకిరా పాడిన  ‘వాకా వాకా ’ పాట ఎంతో పాపులర్ అయ్యింది. ఈసారి మాత్రం షకీరాను తప్పించి మరో పాప్ సింగర్ అయిన ‘జెన్నీ ఫర్ లోపేజ్ ’ ని తీసుకున్నారు.

జెన్నీఫర్ లోపేజ్ పాటు పిట్‌బుల్, క్లాడియా (బ్రెజిల్ పాప్ సింగర్) కలిసి ఓ ‘వియ్ ఆర్ వన్ ఓలె ఓలా’ అంటూ ప్రత్యేక పాటను రూపొందించారు. కానీ ప్రారంభోత్సవం మరికొన్ని గంటల ముందే జెన్నీఫర్ లోపేజ్ షాక్ ఇచ్చింది. జెన్నీ ఈ ప్రారంభోత్సావానికి రావడం లేదని నిర్వహాకులు తెలిపారు. దీనికి కారణంగా ప్రదర్శనకు కావాల్సిన ‘ప్రొడక్షన్ ఇబ్బందుల వల్ల రాలేకపోతుందని చెబుతున్నా, కొంత మంది మాత్రం వేరే కారణం ఉందని అంటున్నారు.

జెన్నీఫర్ కి పోటీగా ఆట పై ఉన్న అభిమానంతో ‘షకీరా ‘లా లాలలా ’ అంటూ ఓ పాటను రూపొందించింది. జెన్నీ పాటకంటే షకీరా పాటనే ఎక్కువ మంది వీక్షించారు. జెన్నీ పాటకు అంతంత మాత్రమే ఆదరణ రావడమే కాకుండా, ఆ పాట అంత ఆకర్షణీయంగా లేదని విమర్శలు రావడంతో నిర్వాహకులు ఆమెను తప్పించారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles