మరో కొద్ది గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న ఫిఫా ప్రపంచ ఫుట్ బాల్ టోర్నీ ప్రారంభం కాబోతుంది. మరి ఈ టోర్నీలో ఎవరు విజేతగా నిలవ బోతున్నారనే దాని పై చర్చోప చర్చలు సాగడమే కాకుండా, జోరుగా బెట్టింగులు కూడా సాగుతున్నాయి. చాలా సంవత్సరాల తరువాత ఫిఫాకు ఆతిథ్యం ఇస్తున్న బ్రెజిల్ సొంత గడ్డ పై ఆడబోతుంది. ఫుట్ బాల్ కి ఫేవరెట్ అయిన బ్రెజిల్ కప్ ని సొంతం చేసుకుంటుందంటే , కాదు కాదు డిపెండింగ్ ఛాంపియన్ స్పెయిన్ నే టైటిల్ ని కైవసం చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు
ఆర్థిక వేత్తలు. 52 దేశాలకు చెందిన ఆర్థిక వేత్తలు వివిధ సర్వేలు నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ టోర్నీలో బ్రెజిల్, జర్మనీలు ఫైనల్ కి చేరుకుంటాయని, బ్రెజిల్ విజేతగా నిలుస్తుందని వారు లెక్కలు వేస్తున్నారు. బ్లూమ్ బర్గ్ న్యూస్ పోల్ సర్వేలో 98 శాతం మంది అభిమానులు బ్రెజిలే విజేతగా నిలుస్తుందని తేల్చారు. తరువాతి స్ధానాల్లో జర్మనీ, అర్జెంటీనా, స్సెయిన్ లు నిలుస్తాయని తేల్చారు.
కానీ జర్మనీ శాస్త్రవేత్తలు మాత్రం స్పెయినే విజేతగా నిలుస్తుందని ఫిఫా ర్యాంకిగ్స్, గత మ్యాచ్ ల ప్రదర్శనల ఆధారంగా ప్రియి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పలు లెక్కలు వేసి ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. మరి ఈ ఆర్థిక వేత్తలు చెప్పిన ఫలితాలు ఏ మేరకు వస్తాయో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more