Sachin ganguly line up for football league

Sachin Tendulkar, Sourav Ganguly, Salman Khan, Ranbir Kapoor, Indian Super League, ISL Football, Indian Super League Football, Sachin Tendulkar ISL.

Sachin Tendulkar, Sourav Ganguly, Salman Khan, Ranbir Kapoor and the Sun Network are among the key. stakeholders in the multi-million dollar football league.

క్రికెట్ ని వదిలి ఫుట్ బాల్ పై పడ్డారు

Posted: 04/14/2014 01:09 PM IST
Sachin ganguly line up for football league

ఒకప్పుడు వీరిద్దరు భారత క్రికెట్ లో నంబర్ వన్. ఆటగాళ్ళుగా, కెప్టెన్లుగా సమర్ధవంతగా తన విధుల్ని నిర్వర్తించి రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ఏలిన వారిద్దరు ఆ ఆటకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఫుట్ బాల్ ఆట పై కన్నేశాడు. వారిద్దరే సచిన్, సౌరవ్ గంగూలీ. క్రికెట్ లో ఐపీఎల్, బ్యాడ్మింటన్ లో ఐబీఎల్ లాగా పుల్ బాల్ లో ఐఎస్ఎల్ (ఇండియన్ సూపర్ లీగ్ ) జట్లను దక్కించుకొని, వాటికి యాజమానులుగా మారారు.

క్రికెట్ లో ఒకే జట్టుకు ఆడిన వీరిద్దరు ఇక పై తమ జట్ల కోసం ప్రత్యర్థులుగా మారబోతున్నారు. ఐఎంజీ- రియలన్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ లీగ్ కి సంబంధించిన బిడ్డింగ్ వివరాలను, కొనుగోలు చేసిన జట్ల యాజమానుల పేర్లను వెల్లడించారు. కొచ్చి టీమ్‌ను  జట్టును సచిన్ పీవీపీ వెంచర్స్‌తో కలిసి దక్కించుకోగా, చిన్నప్పటి నుంచీ ఈ ఆటను అమితంగా ఆరాధించే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోల్‌కతా జట్టుకు యజమానిగా మారాడు.

వ్యాపారవేత్త హర్షవర్థన్ నియోటియా, సంజీవ్ గోయెంకా, ఉత్సవ్ పరేఖ్‌లతో కలిసి దాదా కన్సార్టియంగా మారాడు. ఈ ఇద్దరే కాకుండా బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్ పుణే.. రణ్‌బీర్ కపూర్ ముంబై, జాన్ అబ్రహమ్ గువాహటి జట్లను గెలుచుకున్నారు.

వీరంతా ఫ్రాంచైజీ ఫీజు కింద పదేళ్ల పాటు ఏడాదికి రూ. 10 నుంచి 15 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబర్-నవంబర్ మధ్యకాలంలో ఈ లీగ్ ఆయా నగరాల్లో జరుగుతుంది. మన ఇండియాలో ఫుట్ బాల్ కి అంతగా క్రేజ్ లేదు. మరి ఈలీగ్ తోనైనా దానికి వైభవం తీసుకొస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles