I am not joining aam aadmi party kapil dev

Kapil Dev, Aam Aadmi Party, India World Cup winning captain Kapil Dev, Arvind Kejriwal, Lok Sabha elections, Aamir Khan.

I am not joining Aam Aadmi Party-Kapil Dev

ఆప్ లో చేరడం లేదు: కపిల్ దేవ్

Posted: 03/28/2014 07:18 PM IST
I am not joining aam aadmi party kapil dev

టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ తో పాటు బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూడా ఆప్ లో చేరనున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను  అమీర్ ఖాన్ ఇప్పటికే తోసిపుచ్చగా, తాజాగా కపిల్ స్పందించారు.  

కపిల్ దేవ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరబోతున్నారని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తాను ఆమ్ ఆద్మీలో చేరడం లేదని కపిల్ స్పష్టం చేశారు. 

తన రాజకీయ ప్రవేశం గురించి వచ్చిన వార్తలు అవాస్తవాలని వివరణ ఇచ్చారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న టి-20 ప్రపంచ కప్ లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కపిల్ ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్నారు. అక్కడి నుంచే రాజకీయ ప్రవేశ వార్తలపై వివరణ ఇచ్చారు. భవిష్యత్ లో రాజకీయాల్లో చేరుతారా అన్న ప్రశ్నకు.. తనకు అలాంటి ఆలోచనే లేదని కపిల్ బదులిచ్చారు.

ఆర్ఎస్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles