Yuvraj Singh to play for Australia Big Bash League క్రిస్ గేల్ బాటలోనే యువరాజ్ సింగ్.. ఫ్యాన్స్ ఖుషీ

Yuvraj singh to come out of retirement to play for australia big bash league

Yuvraj Singh, Australia Big Bash League, India Cricket, India all-rounder Yuvraj Singh, Cricket News, Big Bash League, Sports News

Former India all-rounder Yuvraj Singh is reportedly interested in playing the Big Bash League as his manager has confirmed that he is looking for an Australian club.

క్రిస్ గేల్ బాటలోనే యువరాజ్ సింగ్.. ఫ్యాన్స్ ఖుషీ

Posted: 09/13/2020 06:44 PM IST
Yuvraj singh to come out of retirement to play for australia big bash league

వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ బాటలోనే టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ కూడా పయనిస్తున్నట్లు వున్నాడు. ఇంతకీ ఏ విషయంలో అంటారా.? ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అయితే యువరాజ్ సింగ్ మాత్రం ఇలాంటి ప్రకటన చేసిన తరువాత ఏకంగా కొన్న నెలలు పూర్తైన తరువాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఆస్ట్రేలియాలోని ప్రతిష్ఠాత్మక లీగ్ బిగ్‌బాష్‌పై కన్నేశాడంటూ వార్తలు వచ్చాయి. అతడి కోసం ఓ ఫ్రాంచైజీని వెతికే పనిలో క్రికెట్ ఆస్ట్రేలియా తలమునకలై ఉందని యువీ మేనేజర్ కూడా చెప్పాడు.

దీంతో యువీ అభిమానులు మాత్రం మళ్లీ తమ డాషింగ్ బ్యాట్స్ మెన్ ఆటను తిలకించవచ్చునని సంబరపడుతున్నా.. తన నిర్ణయాన్ని బిసిసిఐ మద్దతు పలుకుతుందా.? అన్ని కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎందుకంటే యూవీ ప్రకటించిన తన రిటైర్మెంటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యమే అయినా.. అది అంత సులువుగా బిసిసిఐ అమోదిస్తుందా.? అన్నది వేచి చూడాల్సిందే. ఇదిలావుండగా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ పునీత్ బాలి కోరిక మేరకు తాను తన రిటైర్మెంట్ నిర్ణయంపై పునరాలోచించానని యువీ పేర్కొన్నాడు. నిజానికి రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి తొలుత ఆలోచించానని, బాలి విజ్ఞప్తితో కాదనలేకపోయానని అన్నాడు.

అయితే నెల రోజులుగా బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. యువీ ఇప్పుడు పంజాబ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడనున్నాడని, పంజాబ్ క్రికెట్ సంఘం (పీసీఏ) అభ్యర్థన మేరకు మొహాలీ స్టేడియంలో రెండు సుదీర్ఘ శిబిరాలు కూడా నిర్వహించాడని పునీత్ బాలి తెలిపారు. యువీ ఆధ్వర్యంలో ఈ శిబిరంలో శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, ప్రభ్ సిమ్రన్ సింగ్, అన్మోల్ ప్రీత్ సింగ్ సాధన చేసినట్టు పేర్కొన్నారు. శిక్షణ సందర్భంగా యువీ మళ్లీ ఆటపై మనసు మళ్లిందని, తాను రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు పేర్కొంటూ బీసీసీఐ చీఫ్ గంగూలీకి యువీ లేఖ రాశాడని బాలి వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles