Taniya Bhatia robbed in London hotel లండన్ హోటల్లో టీమిండియా మహిళా క్రికెటర్ బ్యాగ్ చోరీ

Indian female cricketer robbed in london hotel cash and jewellery stolen

Taniyaa bhatia, Bag, Stolen, Marriot Hotel London, Hotel room, Maida Vale management, BCCI Women, London, English Cricket Board (ECB), Marylebone Cricket Club (MCC), England Tour, Team India, Ind vs Eng, Sports, Cricket

The dust is yet to settle on the Deepti Sharma and Charlotte Dean controversy surrounding the run-out incident on Sunday before yet another controversy has taken center stage. Team India star batter Taniya Bhatia had her precious items stolen from her hotel room in London on Monday after she confirmed the news on Twitter.

లండన్ హోటల్లో టీమిండియా మహిళా క్రికెటర్ బ్యాగ్ చోరీ

Posted: 09/27/2022 06:45 PM IST
Indian female cricketer robbed in london hotel cash and jewellery stolen

ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తాయి. అది ముగియముందే టీమిండియా మహిళల జట్టు వికెట్ కీపర్ తానియా భాటియాకు చేదు అనుభవం ఎదురైంది. తనకు కేటాయించిన హోటల్ గదిలో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి నగదు, కార్డులు, నగలు, విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్ ను దొంగలించారు. దీంతో అమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా మహిళల జట్టు అతిథ్యజట్టును క్లీన్ స్వీప్ చేసి.. వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్నా.. ఆ ఆనందం మాత్రం నిలవనీయకుండా చేసింది. మ్యాచ్ సందర్భంగా భారత మహిళల జట్టు లండన్ లోని మారియట్ హోటల్ లో బస చేసింది. ఈ సందర్భంగా తానియా భాటియా బ్యాగ్ కనిపించకుండా పోయింది. ఆ బ్యాగులో నగదు, కార్డులు, వాచీలు, నగలు ఉన్నాయని తానియా భాటియా వాపోయింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు హోటల్ భాగస్వామిగా ఉన్న మారియట్ హోటల్ లో ఇలాంటి ఘటన జరగడం  దిగ్భ్రాంతికి గురిచేసిందని అమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటనతో తీవ్ర నిరాశకు గురయ్యానని తెలిపింది.

తన గదిలోకి ఎవరో వచ్చారని, వారే తన బ్యాగ్ చోరీ చేసి ఉంటారని తానియా పేర్కొంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భాగస్వామ్య హోటల్ లో ఈ విధమైన భద్రతా వైఫల్యం విస్మయానికి గురిచేస్తోందని వెల్లడించింది. ఈ ఘటనపై త్వరితగతిన విచారణ చేపట్టి.. దొంగతనం వ్యవహారంలో దొషులను పట్టుకోవాల్సిందిగా అమె కొరింది. కాగా, ఈ ఘటనపై లండన్ లోని మారియట్ హోటల్ స్పందించింది. టీమిండియా మహిళా క్రికెటర్ తానియాకు క్షమాపణలు తెలియజేసింది. అయితే ఏ తేదీల్లో తమ హోటల్ లో బస చేసిందో ఆ వివరాలను పంపిస్తే ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Taniyaa bhatia  Bag  Stolen  Hotel room  London  England Tour  Team India  Ind vs Eng  Sports  Cricket  

Other Articles