MS Dhoni takes 'bravest decision' in IPL 2020 ఐపీఎల్ లో రిస్క్ చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్.!

Ipl 2020 ms dhoni takes bravest decision in ipl 2020

Chennai Super Kings schedule in IPL 2020, Indian Premier League. latest news on Dhoni. MI vs CSK. MS Dhoni vs Rohit Sharma 19 September. MS Dhoni's bravest decision in IPL, Chennai Super Kings, Mumbai Indians, IPL 2020, CSK vs Mumbai Indians, MI vs CSK, MS Dhoni, Rohit Sharma, bravest decision, Cricket, sports

IPL Governing Council Chairman Brijesh Patel gave CSK an option to play the Match number 5 of IPL 2020. This could have given CSK more time to prepare themselves and also overcome all issues that they are currently grappling with. But the courageous captain of CSK, Dhoni declined the offer. He rather opted to start CSK's IPL 2020 campaign against Mumbai Indians on the opening evening of the league.

ఐపీఎల్ ఆరంభమ్యాచ్ తో రిస్క్ చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్.!

Posted: 09/08/2020 01:22 AM IST
Ipl 2020 ms dhoni takes bravest decision in ipl 2020

సెప్టెంబర్‌ 19న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్ తో తొలి మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్‌ తలపడటం ఇక ఖాయమైంది. అయితే ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించినా అందుకు కారణం మాత్రం మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీయేనని సమాచారం. కోవిడ్ నేపథ్యంలో ఆటగాళ్లు ఎక్కువ రోజులు క్వారంటైన్ లోనే ఉన్నారు. సరైన సన్నద్ధత లేదు.. దీనికి తోడు కీలక ఆటగాళ్లు లేరు..  ఇద్దరు క్రికెటర్లు కరోనా బారిన పడినా చెన్నై సూపర్ కింగ్స్ 19న ఐపీఎల్ కు కిక్ స్టార్ట్ ఇచ్చేందుకు మొగ్గుచూపడానికి కారణం.. మిస్టర్ కూల్ ధోనియే. రిస్క్ లేనిదే.. ఏదీ లేదని భావించే ధోనియే ఇందుకు గగ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఇలా షెడ్యూల్ ఫిక్స్ అయ్యిందని తెలిసింది.

అంతకుముందు కోహ్లీ, దినేశ్ కార్తీక్ చిత్రాన్ని ఐపీఎల్ ట్విట్టర్ లో ఉంచగా.. ఇక దానికి క్యాప్షన్ కూడా ‘మరో 14 రోజుల్లో..’ అంటూ వారు షేర్ చేసుకోవడంతో సీఎస్కే ముంబై ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ జరగదని రమారమి అందరూ అనుకున్నారు. కోల్‌కతా, బెంగళూరు మధ్య ఆరంభమ్యాచ్ జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎంఎస్‌ ధోనీ తీసుకున్న అనూహ్య నిర్ణయం వల్లే మొదటి మ్యాచులో చెన్నై ఆడుతోందట. వాస్తవంగా సెప్టెంబర్‌ 19 లేదా 23న తొలి మ్యాచ్‌ ఆడేందుకు ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ సీఎస్‌కే అవకాశం కల్పించారని తెలిసింది. ఐదు రోజులు వెసులుబాటు దొరికితే సాధన చేసేందుకు సమయం దొరుకుతుందని అలా చేశారు.

ఎంఎస్‌ ధోనీ మాత్రం ఇందుకు ఒప్పుకోలేదని సమాచారం. కెరీర్‌లో ఎన్నోసార్లు సాహసాలు చేసిన అతడు మరోసారి కఠిన నిర్ణయానికే మొగ్గుచూపాడు. సమయం సరిపోకున్నా సెప్టెంబర్‌ 19నే తొలి మ్యాచులో తలపడతామని చెప్పాడట. ఇలా చేయడం వల్ల మొదటి ఆరు రోజుల్లోనే సీఎస్‌కే మూడు మ్యాచులు ఆడాల్సి వస్తుంది. విశ్రాంతి తీసుకొనే సమయమూ దొరకదు. అయినా రిస్క్‌ చేసేందుకే ‘మిస్టర్‌ కూల్‌’ పట్టుదలగా ఉన్నాడని తెలిసింది. ఆటగాళ్లూ విపరీతమైన ఆత్మవిశ్వాసంతో ఉన్నారని ఐపీఎల్‌ వర్గాలు అనుకుంటున్నాయి. ఇప్పటికే రైనా, హర్భజన్‌ సింగ్‌ లేడు. మరి ధోనీ నిర్ణయ ఫలితాలు ఉంటాయో కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. అబుదాబి వేదికగా సెప్టెంబర్‌ 19న ముంబయి ఇండియన్స్, షార్జా వేదికగా 22న రాజస్థాన్‌ రాయల్స్‌, దుబాయ్‌ వేదికగా 25న ఢిల్లీ క్యాపిటల్స్ తో చెన్నై సూపర్‌కింగ్స్‌ తలపడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles