గత నెల 15వ తేదీన తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరమించుకుంటున్నానని ఎంఎస్ ధోనీ ప్రకటించిన తరువాత, ఆ స్థానాన్ని ఆక్రమించాలని రిషబ్ పంత్ భావిస్తూ, తనను తాను ధోనీతో పోల్చుకుంటున్నాడని మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోనీ స్థానాన్ని ఆక్రమించాలని భావిస్తున్న ఈ యంగ్ క్రికెటర్, తన అంతర్జాతీయ క్రికెట్ ను విజయవంతంగా ప్రారంభించి, టెస్టులు, వన్డేల్లో కీపింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తన అత్యుత్సాహం, ఓవర్ కాన్ఫిడెన్స్ తో రిషబ్ పంత్, తన ఆటను మరచిపోతున్నాడని ప్రసాద్ వ్యాఖ్యానించారు. తాజాగా ఎంఎస్కే ప్రసాద్ 'స్పోర్ట్స్ కేడియా'కు ఇంటర్వ్యూ ఇస్తూ, తనంతట తానుగా ఎదగాలే తప్ప, ధోనీ వంటి ఆటగాడితో పోల్చుకోవద్దని రిషబ్ కు సూచించారు.
"రిషబ్ పంత్ ఎప్పుడు మైదానంలోకి దిగినా, ఎంఎస్ ధోనీతో తనను తాను పోల్చుకుంటాడు. అదే అతనికి చాలాసార్లు మైనస్ అవుతోంది. ఈ విషయంలో నేను కూడా చాలాసార్లు రిషబ్ తో మాట్లాడాను. మిగతా ఆటగాళ్లతో పోలిస్తే, ధోనీ చాలా విభిన్నమైన ఆటగాడని, అతన్ని అనుకరించడం మానేస్తేనే మంచిదని పంత్ కు మేనేజ్ మెంట్ స్పష్టంగా చెప్పింది" అని ప్రసాద్ వ్యాఖ్యానించారు.ధోనీని కాపీ చేయాలని పంత్ భావిస్తున్నాడని, అది అతని కెరీర్ ను దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డ ప్రసాద్, ధోనీ నీడలో నడవాలన్న తన ఆలోచనను రిషబ్ వదిలేయాలని, స్వయంగా ఎదగాలని సూచించారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more