Raina on Dhoni's tireless training in CSK's camp రైనా చూసిన మహిభాయ్ విభిన్న సాధన

Suresh raina on ms dhonis tireless training in csks camp

IPL, Indian Premier League, Indian cricket, MS Dhoni, Chennai Super Kings, coronavirus pandemic, Suresh Raina MS Dhoni, Dhoni IPL 2020, today cricket match, cricket score, cricket news, sports news, cricket, sports

Despite not having played for India since the 2019 ODI World Cup semi-final, MS Dhoni was showing no signs of getting tired during Chennai Super Kings' training camp in March before coronavirus pandemic caused postponement of Indian Premier League, Suresh Raina has said.

రైనా చూసిన మహిభాయ్ విభిన్న సాధన

Posted: 06/04/2020 06:15 PM IST
Suresh raina on ms dhonis tireless training in csks camp

టీమిండియా మాజీ సారధి, వికెట్ కీపర్, మిస్టర్ కూల్ ధోని రిటైర్మెంట్ పై వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఆయన ఎంతలా కష్టపడుతున్నారు.. అందుకు ఎలా సన్నధమవుతున్నారో చెప్పుకోచ్చాడు టీమిండియా మాజీ ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్‌ కీలక ఆటగాడు సురేష్ రైనా. చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్‌ ధోనీ ఐపీఎల్‌కు ఈసారి విభిన్నంగా ప్రిపేర్ అవుతున్నాడు. మహీ, రాయుడు, మురళీ, తాను ఒక బృందంగా ఏర్పడి సాధన చేశామని చెప్పాడు.  లాక్ డౌన్‌కు ముందు చెన్నైలో నిర్వహించిన శిబిరానికి వీరంతా హాజరైన సంగతి తెలిసిందే.

చెన్నైలో ఉన్నప్పుడు ధోనీ ప్రతిరోజు 2-4 గంటలు సాధన చేసేవాడు. అయినప్పటికీ అతడు ఏమాత్రం అలసిపోలేదని అన్నారు. ఉదయం జిమ్ లో కసరత్తులు చేయడంతో పాటు.. సాయంత్రం 3 గంటలు బ్యాటింగ్‌ సాధన చేసేవాడు. వరుసగా జిమ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ సాధన చేస్తే మరుసటి రోజు శరీరమంతా బిగుతుగా మారినా ఆయన సాధనే నిలపడం లేదని అన్నారు. అలాంటప్పుడు మన శరీరం కొద్దిగా నెమ్మదించినా.. అదే సమయంలో మరింత కష్టపడాలని ఆయన ప్రోత్సహిస్తున్నారని రైనా తెలిపాడు.

మూడు గంటల శిక్షణ వుంటే ఐదు గంటలు సాధన చేయాలన్నారు అప్పుడే అలసట లేకుండా నాలుగు గంటలు మ్యాచ్‌ ఆడగలమని రైనా పేర్కొన్నాడు. ‘టీమిండియా, చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున మహీభాయ్ తో కలిసి ఆడాను. అప్పటితో పోలిస్తే ఇప్పుడు సాధన భిన్నంగా సాగింది. ఆయన ఎంత బాగా సన్నద్ధమయ్యారో తెలుసుకొనేందుకు టోర్నీ త్వరగా ఆరంభం కావాలని కోరుకుంటున్నని అన్నారు. శిబిరంలో ప్రత్యక్షంగా తానేం చూశానో అందరికీ తెలియాలని భావిస్తున్నా. ఎవరైనా కష్టపడి సాధన చేస్తే ప్రార్థనలు, ఆశీర్వాదాలు వాటి పనిచేస్తాయని రైనా వెల్లడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles