ICC probing 3 Lankan players for match-fixing ముగ్గురు శ్రీలంక ఆటగాళ్ల మ్యాచ్ ఫిక్సింగ్ పై ఐసిసి విచారణ

Sri lanka cricket says 3 former players in icc graft probe

ICC, Sri Lanka cricket, Sri Lankan players ICC, Sri Lankan players corruption, International Cricket Council Anti-Corruption Unit, sri lankan current players, today cricket match, cricket score, cricket news, sports news, cricket, sports

Cricket's world body is investigating three former Sri Lankan players over alleged corruption, in the latest scandal to hit the sport in the country. Sri Lanka Cricket did not name the targets of the probe by the International Cricket Council Anti-Corruption Unit, but insisted no current national players were involved.

ముగ్గురు శ్రీలంక ఆటగాళ్ల మ్యాచ్ ఫిక్సింగ్ పై ఐసిసి విచారణ

Posted: 06/05/2020 03:07 PM IST
Sri lanka cricket says 3 former players in icc graft probe

క్రికెట్ ప్రపంచాన్ని ఫిక్సింగ్ భూతం పట్టిపీడిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రజల అభిమాన క్రీడా క్రికెట్ ను ఫిక్సింగ్ మాఫియా తమ కబంధ హస్తాలలోకి తీసుకోవాలని ప్రయత్నాలు కొనసాగిస్తూనే వుంది. అంతర్జాతీయ క్రికెట్ అడుతున్న క్రీడాకారుల నుంచి దేశీయ క్రికెట్ అడే క్రీడాకారుల వరకు అందరినీ తన ప్రభావానికి గురిచేస్తున్న మ్యాచ్ ఫిక్సింగ్ భూతం చివరాఖరున వారిని కూడా బలిపశువుల్ని చేస్తోంది. కొందరు ఆటగాళ్లను వారి బారిన పడగానే పట్టుకునే నిఘా కళ్లు.. కొందరిని మాత్రం ఫిక్సింగ్ అరోపణలు వచ్చిన తరువాత విచారణ చేస్తోంది.

అయితే తాజాగా శ్రీలంక క్రికెట్లో ముగ్గురు ఆటగాళ్లు దాని ప్రభావానికి పడి నెలలు గడిచిన తరువాత నిఘాకళ్లు తెరుచుకున్నాయి. దీంతో విచారన పర్వం సాగుతోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శ్రీలంకకు చెందిన ముగ్గురు క్రికెటర్లపై తమ అవినీతి నిరోధక బృందంతో విచారణ సాగిస్తోంది. అయితే ఈ ముగ్గురు క్రీడాకారులు ఎవరన్న వివరాలను తెలిపేందుకు నిరాకరించిన ఐసీసీ.. విచారణ పూర్తైన తరువాత క్రీడాకారుల పేర్లను వెలువరిస్తామని చెప్పింది. ఇక ప్రస్తుతం తమ జట్టులో కొనసాగుతున్న వారెవరూ ఈ జాబితాలో లేరని పేర్కోంది.

ఈ విషయంలో లంక క్రీడల మంత్రి దుల్లాస్ అలహపెరుమ స్పందిస్తూ, తమ దేశానికి అంతర్జాతీయ క్రికెట్ లో ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు క్రీడాకారులపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయని.. వారిపై ఐసీసీ విచారణ కూడా కోనసాగుతుందని చెప్పారు. దీనిపై శ్రీలంక బోర్డు వివరణ ఇస్తూ, ఆ ముగ్గురిలో ప్రస్తుత జాతీయ జట్టుకు ఆడుతున్న వారెవరూ లేరని, విచారణ ఎదుర్కొంటున్నది మాజీ ఆటగాళ్లని స్పష్టం చేసింది. కాగా, ఆ ముగ్గురు క్రికెటర్లు ఎవరన్నది లంక క్రీడల మంత్రి వెల్లడించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles