Robin Uthappa names MS Dhoni's successor ధోని వారుసుడు దోరికేశాడంటున్న రాబిన్ ఉత్తప్ప

Robin uthappa names player who could be indias next ms dhoni

Mahendra Singh Dhoni, MS Dhoni, Mr Cool, Indian wicket keeper, retirement from international cricket, retirement, #DhoniRetires, Successor, Riyan Parag, Robin Uthappa, Rishab Pant, Cricket news, sports news, cricket, sports

Veteran India batsman Robin Uthappa picked heir to MS Dhoni's throne. The right-handed batsman said 18-year-old Riyan Parag could be the answer to 'next MS Dhoni' for India. The speculation around Dhoni's has been going all over with earlier this week a hoax '#DhoniRetires' trended on Twitter.

ధోని వారుసుడు దోరికేశాడంటున్న రాబిన్ ఉత్తప్ప

Posted: 05/30/2020 09:25 PM IST
Robin uthappa names player who could be indias next ms dhoni

టీమిండియా మాజీ సారథి, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని ఓ అరుదైన ఆటగాడు. వికెట్ కీవపింగ్ బ్యాటింగ్, సారధ్య బాధ్యతలు, బంతిబంతికీ మారే వ్యూహప్రతివ్యూహాలు.. వీటన్నింటినీ నిర్వహిస్తున్నా ఎంతో గ్రౌండ్ లో ఎంతో ప్రశాంతంగా వుండే క్రికెటర్ ఆయన. గత ఏడాది నుంచి ధోని టీమిండియా జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక తాజగా ఆయన రిటైర్మెంటుపై కూడా అనేక మంది పలు విధాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆ నిర్ణయం ఆయనదేనని, మరికోందరు ఇక ఆయన అవసరం తీరిపోయందని, మరికోందరు వుందని ఇలా ఎవరికి వారు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

ఈ తరుణంలో ఆయన తరువాత ఆయన వారసుడు ఎవరన్న విషయమై బీసీసీఐలోనూ భారీ చర్చ జరుగుతోంది. ఢిల్లీ యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేరు మరింత ఎక్కువగా వినిపించింది. కానీ తనకు వచ్చిన అవకాశాలను పంత్ సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు.ఈ నేపథ్యంలో, ధోనీకి సిసలైన వారసుడిగా మరో కొత్త పేరు తెరపైకి తెచ్చింది. కర్ణాటక క్రికెటర్ రాబిన్ ఉతప్ప దీనిపై మాట్లాడుతూ, రియాన్ పరాగ్ పేరును ప్రస్తావించాడు. టీమిండియాలో ధోనీ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా రియాన్ పరాగ్ కు ఉందని ఉత్తప్ప తెలిపాడు.

ధోనీ తర్వాత పరాగేనని, అతడ్ని భారత జట్టులో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఊతప్ప పేర్కొన్నాడు. పరాగ్ సామర్థ్యం దృష్ట్యా ఎక్కువ కాలం టీమిండియాకు సేవలు అందిస్తాడని వివరించాడు. కాగా, రియాన్ పరాగ్ పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా ప్రశంసల జల్లు కురిపించాడు. ఆటపై పరాగ్ కు మంచి పట్టు ఉందని అన్నాడు. భవిష్యత్ లో మరింతగా ఎదుగుతాడని తెలిపాడు. అసోం రాష్ట్రానికి చెందిన పరాగ్ వయసు 18 ఏళ్లే. అసోం రంజీ జట్టు తరఫున దేశవాళీ పోటీలాడుతూ, ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఎంపికయ్యాడు. గత ఐపీఎల్ సీజన్ లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles