టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. మరోమారు వాంఖేడ్ స్టేడియం వేదికగా వెస్టిండిస్ తో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో ఓ అరుదైన సంఘటనతో వార్తల్లో నిలిచాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్లో ప్రత్యర్థి ఆటగాడు విలియమ్స్ ను ఉద్దేశించి కోహ్లి ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో బదులుతీర్చుకున్నాడు. తన చేతిని 'నోట్‌బుక్'గా మార్చి.. టిక్ కొడుతున్నట్లు చేసిన విన్యాసంతో.. గతంలో తన వికెట్ తీసిని విలియమ్స్ ఇలాంటి విన్యాసాలతోనే సంబరాలు చేసుకున్నాడు. దీంతో అదే విన్యాసాన్ని ప్రదర్శించిన కోహ్లీ బదులు తీర్చుకన్నాడు. ఈ వీడియో గత కొన్ని రోజుల క్రితం సామాజిక మాద్యమాల్లో వైరల్ గా మారింది.
ఇక తాజాగా మళ్లీ అలాంటి విన్యాసాన్నే ప్రదర్శించి వార్తల్లో నిలిచాడు టీమిండియా కెప్టెన్. విండీస్ తో నిన్న జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచులోనూ చెలరేగిన విరాట్.. మరోమారు కెస్రిక్ విలియమ్స్ ను ఆటపట్టించాడు. 29 బంతుల్లో 70 పరుగులు చేసిన కోహ్లీ, నాలుగు ఫోర్లు, ఏడు సిక్స్ లు బాదాడు. ఈ క్రమంలో కోహ్లీ రియాక్షన్ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వెస్టిండీస్ బౌలర్ కెస్రిక్ విలియమ్స్ ను కోహ్లీ అనుకరించడమే ఇందులో విశేషం.
తొలుత విలియమ్స్ బౌలింగ్ ను ఎదుర్కోవడానికి కాస్తంత ఇబ్బంది పడ్డట్టు కనిపించిన కోహ్లీ, ఆ తరువాత రెచ్చిపోయాడు. విలియమ్స్ బౌలింగ్ లో భారీ సిక్స్ కొట్టిన తరువాత, వికెట్ తీసిన సమయంలో అతను ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడో, అలాగే ఆ సిక్స్ ను సెలబ్రేట్ చేసుకున్నాడు. కళ్లు పెద్దవిగా చేసి బాల్ ను చూస్తూ ఆనందించాడు. ఆపై బౌలర్ వద్దకు వెళ్లి తన నోటికి కూడా పని చెప్పాడు. ఈ వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more