India crush West Indies to clinch T20 series చివరి టీ-20లో టీమిండియా విజయం.. సీక్సర్ల వర్షం..

Clinical show from team india as they romp past west indies by 67 runs

India vs West Indies, Ind vs WI, Kohli, Virat Kohli, Mumbai, Wankhede, Team India, West Indies, Virat Kohli, Rohit Sharma, KL Rahul, Kohli six, Kesrick Williams, Kesrick Williams Kohli, Kohli vs Williams, sports news, cricket, sports, cricket, sports

Team India openers launched an all-out attack on the West Indies bowlers. Rohit Sharma and KL Rahul started the assault and it was given the final push by skipper Virat Kohli, who was at his rampant best.

చివరి టీ-20లో టీమిండియా విజయం.. సీక్సర్ల వర్షం..

Posted: 12/12/2019 07:44 PM IST
Clinical show from team india as they romp past west indies by 67 runs

విధ్వంసక జట్టు వెస్టిండీస్ తో జరిగిన టీ20ల సిరీస్ ను టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. ఈ సిరీస్ లో నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్ లో విండీస్ పై 67 పరుగులతో విజయం సాధించిన టిమిండియా.. 2-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ముంబైలో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో టీమిండియా జట్టు సమిష్టిగా రాణించడంతో పాటు టాప్ అర్ఢర్ బ్యాట్స్ మెన్ల వీరబాధుడు ముందు విండీస్ తలగ్గక తప్పలేదు. 241 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యఛేదనలో వెస్టిండియన్లు చివరికి 8 వికెట్లకు 173 పరుగులు మాత్రమే చేశారు.

ఆ జట్టులో కెప్టెన్ పొలార్డ్ 68 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. షిమ్రోన్ హెట్మెయర్ 41 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో విండీస్ కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో చహర్, భువీ, షమీ, కుల్దీప్ తలో 2 వికెట్లతో రాణించారు. అంతకుముందు టీమిండియా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (34 బంతుల్లో 71), కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 91), కెప్టెన్ కోహ్లీ (29 బంతుల్లో 70 నాటౌట్) అదరగొట్టారు. దాంతో టీమిండియా 20 ఓవర్లలో 3 వికెట్లకు 240 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

సిక్సర్ల వర్షం.. బౌండరీల జల్లు..

ముంబయి వాంఖెడే మైదానంలో టాప్ ఆర్డర్ బ్యాట్స్ తమ బ్యాట్ ను ఝుళిపించారు. విండీస్ బౌలర్లపై తమ ప్రతాపాన్ని చాటారు. ఫలితంగా నిన్నటి మ్యాచ్లో సిక్సర్ల వర్షం.. బౌండరీల జట్టు కురిసిందంటే అతిశయోక్తి కాదు. భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసి ఓవర్ రేట్ ను ఆరు బంతులకు పన్నెండు పరుగులుగా నిర్ధేశించింది. రోహిత్ శర్మ (71), కేఎల్ రాహుల్ (91 నాటౌట్), కెప్టెన్ విరాట్ కోహ్లీ పోటాపోటీగా సిక్సర్లు బాదారు.

టీమిండియా ఇన్నింగ్స్ లో మొత్తం 16 సిక్సర్లు ఉండగా, వాటిలో కోహ్లీ కొట్టినవే 7 సిక్సులున్నాయి. రోహిత్ 5 సిక్స్ లు, రాహుల్ 4 సిక్స్ లు సంధించారు. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఆట తీరే హైలైట్. అత్యధిక ఓవర్లు ముగిసిన తర్వాత బరిలో దిగినా విపరీతమైన దూకుడుతో కేవలం 29 బంతుల్లోనే 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రాహుల్ సైతం విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ 56 బంతుల్లో 91 పరుగులు చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IND vs WI  Mumbai  Wankhede  Team India  West Indies  Virat Kohli  Rohit Sharma  KL Rahul  Cricket  sports  

Other Articles