Harbhajan Singh questions selection rules బిసిసిఐ సెలక్షన్ తీరును ప్రశ్నించిన హర్భజన్..

Harbhajan singh questions bcci s selection policy backs suryakumar yadav

India vs Sri Lanka T20Is, India vs Australia, Team India squad, Harbhajan Singh, Suryakumar Yadav, MSK Prasad, BCCI, BCCI's selection policyMumbai Indians, Indian Premier League, Team India, Cricket, sports, sports news, cricket, sports, cricket, sports

Veteran off-spinner Harbhajan Singh has questioned the selection policy of the BCCI after Suryakumar Yadav couldn’t find a place in India squad for the upcoming T20I and ODI series against Sri Lanka and Australia respectively.

బిసిసిఐ సెలక్షన్ తీరును ప్రశ్నించిన హర్భజన్..

Posted: 12/24/2019 08:31 PM IST
Harbhajan singh questions bcci s selection policy backs suryakumar yadav

ఎంఎస్‌కే ప్రసాద్ సారథ్యంలోని సెలక్టర్లపై భారత జట్టు సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్ర విమర్శలు చేశాడు. శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌లతోపాటు న్యూజిలాండ్ పర్యటనకు ప్రకటించిన భారత-ఎ జట్టులో సూర్యకుమార్ యాదవ్‌కు చోటు కల్పించకపోవడాన్ని భజ్జీ తప్పుబట్టాడు. అతడు చేసిన తప్పేంటో అర్థం కావడం లేదన్నాడు. అందరిలానే అతడు పరుగులు సాధిస్తున్నా, ఎంపిక చేయకపోవడం బాధాకరమని అన్నాడు.
 
ముంబైకి చెందిన సూర్యకుమార్ యాదవ్ 73 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 4,920 పరుగులు చేశాడు. చూస్తుంటే జాతీయ జట్టు సెలక్టర్లు వేర్వేరు ఆటగాళ్లకు వేర్వేరు నిబంధనలు పాటిస్తున్నట్టు ఉందని హర్భజన్ విమర్శలు గుప్పించాడు. సెలక్టర్లపై విమర్శలతో విరుచుకుపడడం హర్భజన్‌కు కొత్త కాదు. విండీస్‌తో సిరీస్‌కు నవంబరులో ప్రకటించిన భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజు శాంసన్‌ను పక్కనపెట్టడాన్ని కూడా ఈ ఆఫ్ స్నిన్నర్ తప్పుబట్టాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles