Smriti Mandhana 2nd fastest Indian to score 2000 ODI runs 2వేల మైలురాయిని అందుకున్న స్మృతి మంధాన

Smriti mandhana first fastest woman cricketer to score 2000 odi runs

smriti mandhana, smriti mandhana record, smriti mandhana 2000 runs, india vs west indies, west indies vs india, shikhar dhawan, smriti mandhana record ODI, Smriti Mandhana 2000 runs, india cricket, india women's cricket, smriti mandhana 2000 runs, smriti mandhana ODI, smriti mandhana news, smriti mandhana ODI news, smriti mandhana ODI runs, smriti mandhana latest, smriti mandhana record, smriti mandhana shikhar dhawan, cricket news, sports news, cricket, sports

Smriti Mandhana has become the second fastest Indian to score 2000 runs in one-day internationals, adding yet another feather to her cap. The left-handed batter achieved the feat during the third and final ODI against West Indies

2వేల మైలురాయిని అందుకున్న మూడో మహిళా క్రికెటర్..

Posted: 11/07/2019 08:41 PM IST
Smriti mandhana first fastest woman cricketer to score 2000 odi runs

మహిళల వన్డే క్రికెట్లో వేగంగా రెండువేల పరుగుల మైలురాయిని అందుకున్న మూడో క్రికెటర్ గా స్మృతి మంధాన రికార్డు నమోదు చేసింది. వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో మంధాన 74 పరుగులు చేసింది. ఇందుకు 63 బంతులను ఎదుర్కొంది. ఈ మ్యాచ్ ను భారత్ 6 వికెట్ల తేడాతో గెలుచుకుంది. ప్రస్తుతం మంధాన మొత్తం 51 వన్డేలు ఆడి 2025 పరుగులు చేసింది. ఈ మైలురాయికి చేరిన తొలి మహిళా క్రికెటర్ గా ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెటర్ బెలిండా క్లార్క్, ప్రస్తుత జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ లు తొలి రెండు స్థానాల్లో నిలిచారు.

అయితే బెలిండా క్లార్క్, మెగ్ లానింగ్ ఇద్దరూ ఈ రికార్డుకు 45 వన్డే ఇన్నింగ్స్ లోనే చేరుకోగా, స్మృతి మంధాన మాత్రం 51 వన్డేలలో ఈ రికార్డుకు చేరుకుంది. కాగా ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్ గా అమె రికార్డులను సోంతం చేసుకుంది. పురుష క్రికెటర్లలో తమ కెరియర్లో 2 వేల పరుగుల మైలురాయిని వేగవంతంగా అందుకున్న వారిలో సఫారీ బ్యాట్స్ మన్ హషీం ఆమ్లా (40 ఇన్నింగ్స్ లు) ఉన్నాడు.

ఇక భారత్ నుంచి చూస్తే.. ఈ రికార్డును అందుకున్న వారిలో శిఖర్ ధావన్ (48 ఇన్నింగ్స్ లు) తొలి స్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో వరుసగా కోహ్లీ  (53 ఇన్నింగ్స్ లు), సౌరవ్ గంగూలీ (52 ఇన్నింగ్స్ లు), సిద్ధూ (52 ఇన్నింగ్స్ లు) ఉన్నారు. వీరితో పోలిస్తే  కోహ్లీ, గంగూలీ, సిద్ధూల రికార్డును మంధాన (51 ఇన్నింగ్స్ లు) అధిగమించింది. విండీస్ పర్యటనలో నిన్నటి వన్డే గెలిచిన భారత మహిళా జట్టు సిరీస్ ను 2-1తో సొంతం చేసుకోగా, ఐదు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భాగంగా  శనివారం ఆతిథ్య జట్టుతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bcci  ipl power player  ipl 2020  ipl new rules  bcci new rules  ipl substitute players  cricket  sports  

Other Articles