ziva dhoni helps dad ms dhoni in washing the new nissan jonga జీవా చిన్న సాయానికి ఫిదా అయిన అభిమానులు

Ziva dhoni helps dad ms dhoni in washing the new nissan jonga

Traffic Rules, Motor Vehicles Amendment Act, traffic cops, Motor Vehicle (Amendment) Act, Motor Vehicle Act, Traffic Police Challan, India, MS Dhoni, Nissan Jonga, MS Dhoni, Ziva, ziva cleaning jeep, dhoni washing jeep, dhoni nissan jonga, Cricket, Cricket News, sports news, sports

S Dhoni and his daughter Ziva were, seen spending some quality time together at their home in Ranchi. Dhoni has shared a video of the father-daughter duo cleaning the new Nissan Jonga. “A little help always goes a long way, especially when u realize it’s a big vehicle,” MSD captioned the post.

జీవా చిన్న సాయానికి ఫిదా అయిన అభిమానులు

Posted: 10/25/2019 05:35 PM IST
Ziva dhoni helps dad ms dhoni in washing the new nissan jonga

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని స్టార్ క్రికెటరే అయినా, ఎంతో సింపుల్ గా జీవనాన్ని గడుపుతారు. ఆయన తన పనులు తానే చేసుకునే వ్యక్తి. ఇదివరకే పలు సందర్భాల్లో ఆయనకు వాహనాలపై వుండే ప్రేమను కనబర్చిన మిస్టర్ కూల్.. కార్లు.. బైకులపై మాత్రం అమితమైన ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఇలా వాటిపై తన ప్రేమను చాటుతూ తాజాగా నిస్సాన్ జోంగా జీప్ ను కొనుగోలు చేశారు.

అయితే దీపావళి పర్వదినం సందర్భంగా ఇళ్లు, దుకాణాలు, వాహనాలు ఇత్యాధులను శుబ్రం చేస్తారు ఉత్తరాది వాసులు. లక్ష్మీ దేవి పూజలను నిర్వహించే పనిలో భాగంగా వీటన్నింటినీ చేస్తుంటారు. మూడు నుంచి ఐదు రోజుల వరకు తమ ఇళ్లు, దుకాణాలు, వ్యాపారసంస్థల్లో లక్ష్మీ దేవి పూజలను ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా తన జీప్ ను కడిగేందుకు ధోనీ ఉపక్రమించాడు. అయితే పెద్దలు ఏ పనిచేసినా.. పిల్లలు కూడా అదే పని చేస్తారన్న నానుడిని మరోమారు నిజం చేసింది జీవా.

ధోని వాహనాన్ని కడుగుతుంటే, ఆయన కూతురు జీవా తండ్రికి తనవంతు సాయాన్ని అందించింది. ధోని, ఓ క్లాత్ తీసుకుని వాహనాన్ని తుడుచుకునే పనిలో పడ్డాడు. తండ్రికి సాయం చేసేందుకు తన బుజ్జి బుజ్జి చేతులతో జీబా కూడా కదిలింది. 'పెద్ద పనికి చిన్న సాయం... ఎప్పటికీ ప్రత్యేకమే' అనే క్యాప్షన్ తో ధోనీ ఈ వీడియోను షేర్ చేయగా, అదికాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది. కేవలం గంట వ్యవధిలో 7 లక్షలకు పైగా వ్యూస్, వేలాది కామెంట్లు వచ్చాయి. మేమూ వచ్చి సాయం చేస్తామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

 
 
 
View this post on Instagram

A little help always goes a long way specially when u realise it’s a big vehicle

A post shared by M S Dhoni (@mahi7781) on

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  MS Dhoni  Nissan Jonga  Ziva  cleaning jeep  Cricket  Ranchi  Jarkhand  sports  

Other Articles