Shakib Al Hasan likely to miss Inda tour భారత పర్యటనకు బంగ్లా కెప్టెన్ కూడా దూరం..!

India vs bangladesh shakib kept away from practice on icc insistence

icc, Team India, Rohit Sharma, india vs bangladesh 2019, shakib al hasan, saifuddin, Tamim Iqbal, Bangladesh cricket club, sports, cricket, sports news, cricket news, sports, cricket

Bangladesh's top player Shakib Al Hasan is being kept away from practice ahead of the team's high-profile India tour on ICC's instructions, local media reported while claiming that the all-rounder is set to be banned for not reporting a corrupt approach.

భారత పర్యటనకు బంగ్లా కెప్టెన్ కూడా దూరం..!

Posted: 10/29/2019 03:20 PM IST
India vs bangladesh shakib kept away from practice on icc insistence

భారత పర్యటనకు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు వస్తుందని వార్తలు వెలువడినా.. ఇంకా పర్యటనకు వచ్చే క్రీడాకారుల పేర్లపై మాత్రం స్పష్టత కొరవడింది. భారత గడ్డపై సిరీస్ ఆరంభానికి ముందే బంగ్లాదేశ్‌కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ సైపుద్దీన్ గాయం కారణంగా జట్టుకి దూరమవగా.. సీనియర్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ వ్యక్తిగత కారణాలతో పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కూడా భారత్ తో సిరీస్‌కి దూరమైనట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా.. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో జరుగుతున్న ట్రైనింగ్ సెషన్ కు కూడా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ దూరంగా ఉన్నట్లు సమాచారం. కేవలం ఒకే ఒక సెషన్ కి హాజరైన షకీబ్.. చురుగ్గా ప్రాక్టీస్ కూడా చేయలేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. బంగ్లాదేశ్‌ ఆటగాళ్ల జీతాల పెంపు విషయమై ఇటీవల షకీబ్ అల్ హసన్ నాయకత్వంలోనే క్రికెటర్లు స్రైక్ చేయగా.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వారి డిమాండ్లని పరిష్కరించేందుకు అంగీకరించింది. దీంతో.. ఆటగాళ్లు సమ్మెని విరమించారు. అయినా షకీబ్ అల్ హసన్ మాత్రం ఇంకా అసంతృప్తితో వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే.. ఈ సమ్మె జరుగుతున్న సమయంలోనే లోకల్ టెలికాం సంస్థతో షకీబ్ ఓ ఒప్పందం చేసుకున్నాడు. బోర్డు నిబంధనల ప్రకారం.. టెలికాం సంస్థతో క్రికెటర్‌ ఎలాంటి ఒప్పందాలు చేసుకోకూడదు. దీంతో.. అతనికి బంగ్లా క్రికెట్ బోర్డు షోకాజ్ నోటీసులు పంపింది. అయితే.. ఇప్పటి వరకూ షకీబ్ ఆ నోటీసులపై స్పందించలేదు. అయితే భారత్ తో జరిగే సిరీస్ కు కూడా ఆయన దూరంగానే వుండనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  కాగా, నవంబరు 3 నుంచి మూడు టీ20లు, రెండు టెస్టుల సిరీస్‌ని టీమిండియాతో బంగ్లాదేశ్‌ ఆడనున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles