Final Hopes Alive: India Beat Sri Lanka by 7 Wickets ఆసియా కప్: శ్రీలంపై టీమిండియా విజయం

Women s asia cup indian cricket team beat sri lanka by 7 wickets

india vs sri lanka, asia cup, bangladesh, thailand, malaysia, jhulan goswami, mithali raj, punam raut, smriti mandhana, sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Outclassed in their last game by Bangladesh, India today bounced back with an improved all-round show to notch up a seven-wicket win over Sri Lanka and keep alive their hopes for a final berth in the Women's Twenty20 Asia Cup

ఆసియా కప్: శ్రీలంపై టీమిండియా విజయం

Posted: 06/07/2018 07:06 PM IST
Women s asia cup indian cricket team beat sri lanka by 7 wickets

ఆసియాకప్‌ టీ20 టోర్నీలో భాగంగా శ్రీలంక మహిళలతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 108 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 18.5 ఓవర్లలో  మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దాంతో టోర్నీలో మూడు విజయాన్ని భారత్‌ సొంతం చేసుకుంది. భారత విజయంలో మిథాలీ రాజ్‌(23), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(24), వేదా కృష్ణమూర్తి(29 నాటౌట్‌), అనుజా పటేల్‌( 19 నాటౌట్‌)లు తలో చేయి వేశారు.

అంతకుముందు లంక మహిళలు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేశారు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు టీమిండియా ఎదుట​ 108 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక జట్టులో యశోదా మెండిస్‌(27), హసిని పెరీరా(46 నాటౌట్‌) మినహా ఎవరూ రాణించలేదు. ఏడుగురు  క్రీడాకారిణులు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో శ్రీలంక సాధారణ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్‌ రెండు వికెట్లు సాధించగా, గోస్వామి, అనుజా పటేల్‌, పూనమ్‌ యాదవ్‌లు తలో వికెట్‌ తీశారు.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ హన్సిక(2) నాల్గో ఓవర్‌లోనే పెవిలియన్‌ చేరి నిరాశపరిచింది. ఆ తరుణంలో యశోదా మెండిస్‌- హసిని పెరీరా ద్వయం ఇన్నింగ్స్‌ను నడిపించింది. వీరిద్దరూ 38 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత యశోద పెవిలియన్‌ చేరింది. ఆపై స్వల్ప వ్యవధిలో శ్రీలంక వికెట్లు కోల్పోవడంతో నెమ్మదిగా బ్యాటింగ్‌ చేసింది. దాంతో లంక మహిళలు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs sri lanka  asia cup  bangladesh  thailand  malaysia  mithali raj  sports  cricket  

Other Articles