Kohli named Indian cricketer of the year బిసిసిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ కోహ్లీకే

Virat kohli to get cricketer of the year award at bcci annual gala

Cricket news, Polly Umrigar Award, virat kohli, Vinod Rai, Vijay Merchant, test Cricket, Polly Umrigar, Jagmohan Dalmiya, Harmanpreet Kaur, Board of Control for Cricket in India, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

India captain Virat Kohli's phenomenal batting form has fetched him the BCCI's best cricketer award for two seasons, while World Cup stars Harmanpreet Kaur and Smriti Mandhana were chosen for the women's equivalent of the honour.

బిసిసిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ విరాట్ కోహీనే

Posted: 06/07/2018 08:20 PM IST
Virat kohli to get cricketer of the year award at bcci annual gala

టీమిండియా కెప్టెన్, భారత పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం వచ్చి చేరింది. 2016-17, 2017-18 సీజన్లలో విశేష ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు బీసీసీఐ అవార్డులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడికి ఇచ్చే పాలి ఉమ్రీగర్‌ అవార్డును విరాట్‌ కోహ్లీ దక్కించుకున్నట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. ఈ అవార్డు కింద కోహ్లీ రూ.30 లక్షలు ‌(ఏడాదికి రూ.15 లక్షల చొప్పున) అందుకోనున్నాడు.

దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌లో విశేష ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు వయస్సుతో సంబంధం లేకుండా అవార్డులకు ఎంపిక చేసినట్లు వారు చెప్పారు. జూన్ 12న బెంగళూరులో ఈ అవార్డుల ప్రదానోత్సం కార్యక్రమం జరగనుంది. 2016-17, 2017-18 సీజన్లలో మహిళల క్రికెట్లో బాగా రాణించినందుకుగాను హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధానకు బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌ అవార్డును అందజేయనున్నారు. వీరిద్దరు కూడా తలో రూ.15 లక్షల చెక్‌ను అందుకోనున్నారు. అవార్డులు దక్కించుకున్న మరికొంత మంది ఆటగాళ్ల వివరాలు చూద్దాం.

2016-17 సీజన్‌:
* కృనాల్‌ పాండ్య- లాలా అమర్‌నాథ్‌ అవార్డు(దేశవాళీ క్రికెట్‌ ఉత్తమ ఆల్‌రౌండర్)
* పర్వీజ్‌ రసూల్‌(జమ్ము& కశ్మీర్‌) - లాలా అమర్‌నాథ్‌ అవార్డు(రంజీ ట్రోఫీలో ఉత్తమ ఆల్ రౌండర్)
* ఠాకూర్‌ తిలక్‌ (హైదరాబాద్‌) - జగన్మోహన్‌ దాల్మియా ట్రోఫీ (అండర్‌-16 విజయ్‌ మర్చంట్‌ టోర్నీలో అత్యధిక స్కోరు)
* పూనమ్‌ రౌత్‌ - జగన్మోహన్‌ దాల్మియా ట్రోఫీ

2017-18 సీజన్‌:
* మయాంక్‌ అగర్వాల్‌ - మాధవరావు సింథియా అవార్డు (రంజీ ట్రోఫీలో అత్యధిక స్కోరు)
* ఆర్యమన్‌ బిర్లా(కుమార మంగళం బిర్లా తనయుడు) - ఎమ్‌ఎ చిదంబరం ట్రోఫీ
* కె. నితీశ్ కుమార్‌ రెడ్డి (ఆంధ్రప్రదేశ్‌) - జగన్మోహన్‌ దాల్మియా ట్రోఫీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  best cricketer  virat kohli  harmanpreet  smriti mandhana  jagmohan dalmiya  cricket  

Other Articles