Kohli Injury Scare For India During Durban ODI తొలి వన్డే మ్యాచ్ మధ్యలో కెప్టెన్ కోహ్లీకి గాయం..

Kohli suffers injury scare during 1st odi against south africa

1st ODI, durban odi, India vs South Africa, South Africa vs India 2018, virat kohli, ODI, India v/s South Africa, Ind vs SA, MS Dhoni, chahal, Hardik Pandya, sports news,sports, latest sports news, cricket news, cricket

Indian captain Virat Kohli gave his team an injury scare when he made a sliding stop in the seventh over, but his boot took a big divot and he appeared to jar his knee as he landed on an outfield softened by overnight rain.

తొలి వన్డే మ్యాచ్ మధ్యలో టీమిండియాకు ఎదురుదెబ్బ

Posted: 02/01/2018 06:11 PM IST
Kohli suffers injury scare during 1st odi against south africa

ఆతిథ్యజట్టు సౌతాఫ్రికాతో అరు మ్యాచుల వన్డే సిరీస్ లో భాగంగా డర్బన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి మ్యాచ్ నుంచే అధిపత్యం కనబర్చి సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మోకాలి గాయంతో పెవిలీయన్ కు చేరుకున్నాడు. దీంతో డర్బన్ లోని కింగ్స్ మీడ్ మైదానం జారడంతో పాటు దిగబడిపోతుందన్న అందోళన జట్టు సభ్యులలో కూడా వ్యక్తం అవుతూ అందోళన కలిగిస్తుంది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి స్టేడియం అవుట్ ఫీల్డ్ తడిసిపోవడమే ఇందుకు కారణమైంది.

దీంతో విరాట్ కోహ్లీ మైదానాన్ని వీడాడు. చాలా సేపట్నుంచి డగౌట్‌లో ఉన్నాడు. ఫీల్డింగ్‌ చేస్తూ బంతిని అందుకునే క్రమంలో పరుగెడుతున్న కోహ్లీ ఒక్కసారిగా మోకాలిని నేలకు ఆనించాడు. తడిగా ఉన్న నేలలో గట్టిగా కాలు పెడితే ఎలా సొట్ట పడుతుందో ఔట్‌ఫీల్డ్‌ కూడా అలాగే అయింది. దీంతో కోహ్లీ కాలు గట్టిగా నేలలో ఇరుక్కుపోవడంతో నొప్పితో డగౌట్‌ చేరాడు. మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఆటగాళ్లకు, బౌలర్లు ఆదేశాలు ఇస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs South Africa  1st ODI  durban odi  virat kohli  MS Dhoni  cricket  

Other Articles