Virat Kohli and crew eye No 1 rank సఫారీలపై విజయానికి శ్రమిస్తున్న టీమిండియా

India vs south africa virat kohli and crew eye no 1 rank

AB de Villiers, Cricket, Faf du Plessis, India, India Vs South Africa, MS Dhoni, ODI,Proteas, Quinton de Kock, Rohit Sharma, South Africa, South Africa vs India, South Africa vs India 2018,Virat Kohli

India and South Africa face off in a six-match ODI series, starting with the first fixture at Durban on 1 February, with the No 1 spot in the ICC ODI rankings on the line.

అతిథ్యజట్టుపై విజయానికి శ్రమిస్తున్న టీమిండియా

Posted: 01/31/2018 08:01 PM IST
India vs south africa virat kohli and crew eye no 1 rank

అతిత్య దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ తరువాత వన్డే సిరీస్ కు గురువారం తెరలేవనుంది. ఈ క్రమంలో టీమిండియా గెలుపు కోసం కాసింత దృడంగానే ప్రయత్నించాల్సి వస్తుంది. అయితే సఫారీల గడ్డపై వన్డే సిరీస్ గెలవడం కూడా విరాట్ సేన శ్రమిస్తుంది. అయితే ఇది కూడా తీరని కలగానే మిగిలిపోతుందన్న వాదనలు కూడా వున్నాయి. 25 ఏళ్లుగా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్తున్నా టీమిండియా మాత్రం రిక్తహస్తాలతోనే స్వదేశానికి తిరివస్తుంది,

ఈ క్రమంలో ఎన్నో ఆశలతో కోహ్లి సేన మరో ఆరు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. గురువారం (ఫిబ్రవరి-1) డర్బన్‌లో తొలి వన్డే జరగనుంది. అయితే ఈ వేదికలో ఇండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.1992 నుంచి డర్బన్‌లో సౌతాఫ్రికాతో ఏడు వన్డేలు ఆడిన టీమిండియా ఆరింట్లో ఓడింది.. ఒకదాంట్లో ఫలితం రాలేదు.

అయితే 2003 వరల్డ్‌కప్‌లో భాగంగా డర్బన్‌లో ఇంగ్లండ్, కెన్యాలపై మాత్రం ఇండియా గెలిచింది. ఇప్పుడు ఆ చరిత్రను తిరగరాసే అవకాశం కోహ్లి సేన ముందు ఉన్నది. టెస్ట్ సిరీస్ కోల్పోయినా.. అత్యంత క్లిష్టమైన వాండరర్స్ పిచ్‌పై మూడో టెస్ట్ గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా.. విజయంతో వన్డే సిరీస్ మొదలుపెట్టాలని చూస్తుంది. సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India Vs South Africa  MS Dhoni  ODI  Proteas  Virat Kohli  Rohit Sharma  

Other Articles