Afghanistan U19 Through To Semifinals ప్రపంచ కప్ లో అదరగొట్టిన అప్ఘనిస్తాన్

Icc u19 world cup afghanistan create history reach semi final

Afghanistan, Bahir Shah, Cricket, Dale Phillips, Full cricket score card, ICC, ICC Under-19 World Cup, Ikram Ali Khil, cricket score, Naveen-ul-Haq, New Zealand, Rachin Ravindra, U-19 World Cup

Afghanistan U19 has beaten New Zealand by a resounding 202 runs in their quarterfinal match in the 2018 U19 ICC Cricket World Cup.

ప్రపంచ కప్ లో అదరగొట్టిన అప్ఘనిస్తాన్

Posted: 01/25/2018 04:12 PM IST
Icc u19 world cup afghanistan create history reach semi final

అప్ఘనిస్తాన్ చరిత్రను సృష్టించింది. ప్రస్తుతం జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ పోటీల్లో అప్రతిహత విజయాలతో ముందుకు దూసుకెళ్లున్న న్యూజిలాండ్ జట్టుకు పెను షాక్ ఇచ్చింది. పసికూనగా ప్రపంచ క్రికెట్ లోకి అడుగుపెట్టిన అప్గనిస్తాన్ గ్రూప్ దశ దాటి సెమీఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఈ క్రమంలో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచులో కివీస్ ను మట్టికరిపించి.. 202 పరుగుల అధిక్యంతో అసాధారణ విజయాన్ని సోంతం చేసుకుంది.

స్వదేశంలో జరగుతున్న టోర్నీలో భాగంగా తాము మెరుగ్గా రాణిస్తామని భావించిన అతిధ్యజట్టు కివీస్ కు అనూహ్య రీతిలో పసికూన ఆఫ్ఘనిస్థాన్ ఖంగుతినిపించింది. ఈ ఓటమి నేపథ్యంలో న్యూజీలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పని పరిస్థితి ఏర్పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు 50 ఓవర్లకు 309 పరుగుల భారీ స్కోర్ చేసింది.

గుర్బాజ్ 69, జర్డాన్ 68, బహీర్ షా 67, అజ్మతుల్లా 66 పరుగులు చేశారు. ఆపై 310 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 28.1 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 202 పరుగుల భారీ విజయం ఆఫ్ఘన్ సొంతమైంది. ఆఫ్ఘన్ జట్టు సెమీఫైనల్ లో పాకిస్థాన్ తో తలపడనుండగా, భారత జట్టు తన తదుపరి మ్యాచ్ ని బంగ్లాదేశ్ తో ఆడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Afghanistan  New Zealand  ICC Under-19 World Cup  Mujeeb Zadran  Naveen-ul-Haq  Rachin Ravindra  

Other Articles