Pollard, first cricketer to play 400 T20 matches టీ20 మ్యాచుల్లో పోలార్డ్ బ్రేస్ లెస్ రికార్డు..

Pollard becomes first cricketer to play 400 t20 matches

Kieron Pollard, T20 cricket, IPl, Indian Premier League, Big Bash league, IPL, 8 countries domestic player, sports news, cricket news, cricket, sports

Windies' all-rounder Kieron Pollard has become the first cricketer to play 400 T20 matches, achieving the feat while playing for Melbourne Renegades against Adelaide Strikers in the BBL

టీ20 మ్యాచుల్లో పోలార్డ్ బ్రేస్ లెస్ రికార్డు..

Posted: 01/25/2018 05:03 PM IST
Pollard becomes first cricketer to play 400 t20 matches

వెస్టిండీస్‌ క్రికెటర్ కీరన్‌ పొలార్డ్ రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పడప్పుడే ఎవరూ బ్రెక్ చేయలేని రికార్డును తన పేరున రాసుకున్నాడు. అదేంటంటే.. టీ20 క్రికెట్ లో అత్యధికంగా 400 మ్యాచ్ లను అడిన ఏకైక క్రికెటర్ గా పోలార్డ్ నిలిచాడు. నిజంగానే పోలార్డ్ ఇప్పటివరకు ఏకంగా 400 టీ20 మ్యాచ్ లను అడాడు. ఏ క్రికెటర్ ఇన్ని టీ20లు ఆడిన దాఖలాలు లేవు. మరి పోలార్డ్ ఒక్కడికే ఇదెలా సాథ్యమైందంటే..

కిరన్ పొలార్డ్‌ ఐసీసీ టీ20 క్రికెట్ మ్యాచ్ లను తమ దేశం వెస్టీండీస్ తరపున అడటంతో పాటు ఇటు భారత్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్, అటు అస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్, సహా మొత్తంగా 8 దేశాల తరపున ఆయన అత్యంత తక్కువ ఫార్మెట్ క్రికెట్ లో సేవలందిస్తున్నాడు. అయితే 8 దేశాలలో దేశీయ క్రికెట్ లీగ్ లలో ఆయన అడటంతో ఏకంగా ఇప్పటివరకు ఆయన 400 టీ20 మ్యాచ్ లను అడాడు. ఇంకా కొనసాగుతున్నాడు.

దీంతో ప్రస్తుతం అస్ట్రేలియాలో జరుగుతోన్న బిగ్‌ బాష్‌లీగ్‌లో పొలార్డ్‌ మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ఘనతను సాధించాడు. సిడ్నీ థండర్స్‌తో పొలార్డ్‌ ఆడిన మ్యాచ్‌ తన కెరీర్లో 401వ టీ20 మ్యాచ్‌ కావడం విశేషం. అంతకుముందు సోమవారం ఆడిలైట్‌ స్టైకర్స్‌తో జరిగిన మ్యాచ్ తో పొలార్డ్‌ 400 మైలురాయిని అందుకున్నాడు. దీంతో అత్యధిక టీ20లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో బ్రావో(372), క్రిస్‌ గేల్‌(323) ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kieron Pollard  T20 cricket  IPl  Indian Premier League  Big Bash league  sports news  cricket  

Other Articles