proteas on top after pacers demolish India మళ్లీ విరాట్ సేన తడబ్యాటు

Proteas bowlers guilty of letting teamindia off the hook on bowler friendly pitch

India vs South Africa, India vs South Africa 2018, India vs South Africa, Virat Kohli, India vs South Africa, wanderers Test, Virat Kohli, pujara, bhuvaneshwar kumar, rahane, sports news, sports, cricket news, cricket, today match, today match score, today match updates

South Africa’s bowlers were guilty of letting India off the hook. Barring Kohli and Pujara, the other batsmen had scores of 8, 0, 9, 2, 0. Yet India managed to accumulate 187 runs, a total that might yet turn out to be a match-winning one

ఛివరి టెస్టులోనూ విరాట్ సేస తడబ్యాటు.. అకట్టుకున్న భువి

Posted: 01/25/2018 09:09 AM IST
Proteas bowlers guilty of letting teamindia off the hook on bowler friendly pitch

టీమిండియా ప్రదర్శనలో మార్పేమీ కనిపించలేదు. అంతా ఎప్పుడెప్పుడు పెవీలియన్ కు వెళ్లిపోదామా అన్నట్లుగా పోటీపడ్డారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, చటేశ్వర్ పూజరాలు అర్థశతకాలతో రాణించారు. అయితే జట్టుకు అవసరమైన కీలక పరుగులను మాత్రం పేసర్ భువనేశ్వర్ ప్రసాద్ చేసి అకట్టుకున్నాడు. ఈ ముగ్గురు మినహాయిస్తే జట్టులోని మిగతా అటగాళ్లందరూ రెండు అంకెలకే పరిమితమయ్యారు. అసలు ఆచితూచి ఆడే ప్రయత్నమే చేయలేదు. కాసేపు ఒపిక పడదామన్న ఆలోచనే లేదు.

దీంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టు తొలి రోజే కోహ్లీసేన గాడి తప్పింది. కేవలం 187 పరుగులకే కుప్పకూలింది..! ఆఖర్లో భువనేశ్వర్‌ ఆదుకున్నాడు కానీ.. లేదంటే జట్టు 150 లోపే చాప చుట్టేసేదే..! ఆపై, మూడో ఓవర్లోనే ప్రత్యర్థి ఓపెనర్‌ వికెట్‌ తీసి భువీ భళా అనిపించాడు..! ఇక, రెండో రోజు అతనితోపాటు మిగతా పేసర్లు సఫారీలను ఏమేరకు కట్టడి చేస్తారనే దానిపైనే భారత భవితవ్యం ఆధారపడి ఉందిప్పుడు..
 
దక్షిణాఫ్రికా గడ్డపై భారత బ్యాటింగ్‌ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. బుధవారం ఇక్కడ మొదలైన మూడో, ఆఖరి టెస్టులో టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (54), చటేశ్వర్‌ పుజారా (50) అర్ధ శతకాలతో రాణించగా.. ఆఖర్లో భువనేశ్వర్‌ (30) గొప్పగా పోరాడాడు. కానీ, మిగతా బ్యాట్స్‌మెన్‌ అంతా కలిసి 27 పరుగులే చేశారు. ఒక్కరూ రెండంకెల మార్కు దాటలేదు.

ఆతిథ్య బౌలర్లలో రబాడ మూడు, మోర్కెల్‌, ఫిలాండర్‌, పెహ్లుక్వాయో తలో రెండు వికెట్లతో భారత్‌ను దెబ్బకొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా తొలిరోజు చివరకు 6/1తో నిలిచింది. ఓపెనర్‌ మార్క్రమ్‌ (2)ను భువీ అవుట్‌ చేశాడు. ఎల్గర్‌ (4 బ్యాటింగ్‌)తో పాటు నైట్‌ వాచ్‌మన్‌ రబాడ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఊహించినట్టే ఈ మ్యాచ్లో రోహిత్‌, అశ్విన్‌ స్థానాల్లో రహానె, భువనేశ్వర్ ను జట్టులోకి తీసుకున్నారు. అయితే భారీ అంచనాల మధ్య జట్టులోకి వచ్చిన రహానే.. కేవలం తొమ్మిది పరుగులకే పరిమితం కాగా, భువి మాత్రం అకట్టుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles