Imran Tahir humiliated by Pakistan High Commission సౌతాఫ్రికా క్రికెటర్ ను అవమానించిన పాక్..

Imran tahir left humiliated by pakistan high commission in england

Imran Tahir, South Africa national cricket team, ICC World XI, Pakistan national cricket team, Ahsan Iqbal, cricket news, sports news, sports, cricket

Imran Tahir was recently left humiliated by the Pakistan High Commission in Birmigham when he visited the office to get visas issued for himself and his family.

క్రికెటర్ ను అవమానించిన పాక్ కాన్సులేట్..

Posted: 09/06/2017 06:56 PM IST
Imran tahir left humiliated by pakistan high commission in england

తమ దేశానికి చెందిన వ్యక్తి పరదేశంలో పేరొందిన క్రికెటర్ గా గుర్తింపు సాధించిన నేపథ్యంలో తన స్వదేశానికి వచ్చి.. పర్యటించి.. ఇక్కడి తనవాళ్లను కలుసుకోవాలని.. పాక్ లో వరల్డ్ ఎలెవన్ జట్టుతో క్రికెట్ అడేందుకు చేసిన ప్రయత్నాలకు స్వాగతించి.. ఘనసత్కారాల మధ్య దేశఅతిథ్యిం అందించాల్సిందిపోయి.. క్రికెటర్ ను గంటల పాటు నిరీక్షింపజేసి.. ఆనక కార్యాలయ పనివేళలు ముగిసాయని చెప్పి.. ఆ క్రికెటర్ ను కార్యలయం వదిలివెళ్లాలని చెబితే.. అ అవేదన మాటల్లో చెప్పనలవి కాదు. కానీ ఇలాంటి అనుభూతి క్రికెటర్లకు ఎదురవుతుందా..? అంటే ఔను అన్న సమాధానమే వస్తుంది.

మరెవరో కాదు స్వతహాగా పాకిస్థానీ అయిన ఇమ్రాన్ తాహీర్ కే ఈ అనుభవం ఎదురైంది. పాకిస్థానీ దక్షిణాఫ్రికా వాసియైన క్రికెటర్‌ ఇమ్రాన్ తాహీర్ కు పాకిస్థాన్ కాన్సులేట్ కార్యాలయం ఈ అనుభూతిని మిగిల్చింది. తన కుటుంబ సభ్యులతో కలిసి ట్రావెల్ వీసా దరఖాస్తు చేసుకునేందుకు కాన్సులేట్ ఆఫీస్ కు వెళ్లాగా.. అక్కడి సిబ్బంది ఐదు గంటలపాటు వేచివున్న తరువాత అఫిస్ హవర్స్ అయిపోయాయని, వెళ్లాలని చెప్పడం తనను తీవ్ర అవేదనకు గురిచేసిందని చెప్పాడు.

అయితే తన విషయంలో హై కమిషనర్ అబ్బాస్ పాక్ కాన్సులేట్ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడంతో తనకు వీసా మంజూరు చేశారని తాహిర్ తెలిపాడు. హైకమిషనర్ అబ్బాస్ కు ధన్యవాదాలు చెబుతూ దక్షిణాఫ్రికా క్రికెటర్ తహిర్ ట్వీట్ చేయడంతో విషయం వెలుగుచూసింది. పాకిస్థాన్ లో వరల్డ్ ఎలెవన్ మ్యాచ్ ఆడేందుకు వచ్చిన స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ ను కాన్సులేట్ అధికారులు అవమానించడం దారుణమంటూ ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles