MS Dhoni set to play his 300th ODI కెరీర్ లోనే ధోని కీలకమైన మ్యాచ్.. అభిమానుల ప్రార్థనలు..

Ms dhoni gears up for 300th odi cool ranchi dude to a cricket giant

MS Dhoni, India vs Sri Lanka, Mahendra Singh Dhoni, 300th ODI, Virat Kohli, Dhoni fans, alternative, yuvraj singh, Team India, sports news, cricket, news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

Nearly 14 years after storming into the international arena, MS Dhoni is set to become the sixth Indian to play 300 one-day internationals.

కెరీర్ లోనే ధోని కీలకమైన మ్యాచ్.. అభిమానుల ప్రార్థనలు..

Posted: 08/30/2017 06:42 PM IST
Ms dhoni gears up for 300th odi cool ranchi dude to a cricket giant

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన కెరీర్ లోనే అత్యంత కీలకమైన మ్యాచ్ ను ఇవాళ అడుతున్నాడు. దాదాపుగా రెండు దశాబ్దాల తరువాత టీమిండియా ప్రపంచకప్‌ అందుకోవడానికి కీలక భూమిక పోషించిన మహేంద్రుడు.. తన కెప్టెన్సీలో ఛాంపియన్స్‌ ట్రోఫీ, టీ20 ప్రపం కప్ ఇలా చిరస్థాయిగా గుర్తిండిపోయే విజయాలను అందించిన విషయం తెలిసిందే. ను అందుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో సారథిగా, ఆటగాడిగా ఎన్నో రికార్డులు నెలకొల్పిన ఈ జార్ఖండ్ డైనమైట్ తన 300 వన్డే మ్యాచ్ తో  త్వరలో మరిన్ని రికార్డులను అధిగమించనున్నాడు.

భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా నిలిచిన ధోనీ.. టీమిండియా దిగ్గజాల మధ్యన స్థానం సంపాదించుకోనున్నాడు. ఇప్పటి వరకు సచిన్ టెండుల్కర్‌(363), రాహుల్ ద్రవిడ్‌(344), మహమ్మద్ అజారుద్దీన్‌(334), సౌరవ్ గంగూలీ(311), యువరాజ్ సింగ్‌(302) మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు. 2004లో సౌరవ్‌ గంగూలీ నాయకత్వంలో వన్డేల్లో అరంగేట్రం చేసిన ధోని.. డిసెంబరు 23న చిట్టగాంగ్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచులో అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టిన ధోనీ తన తొలి మ్యాచ్‌లో పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు.

* 299 వన్డేలలో 88.47 స్ట్రైక్‌ రేట్‌తో 9,608 పరుగులు. వాటిలో 10 సెంచురీలు, 65 అర్ధశతకాలు ఉన్నాయి.
* వన్డేల్లో  వ్యక్తిగత అత్యధిక స్కోరు 183 నాటౌట్‌ (145బంతుల్లో). 2005 డిసెంబరు 31న శ్రీలంకపై సాధించాడు.
* 2007లో సారథిగా బాధ్యతలు అందుకున్న ధోనీ టీమిండియాకు అపూర్వ విజయాలను అందించాడు.
* ధోనీ సారథ్యంలో 199 వన్డేలు అడగా, అందులో 110 విజయాలు, 74 ఓటములు, 4 డ్రాగా ముగియగా, 11 మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
* సారధిగా ధోనీ 199 మ్యాచుల్లో 6,633 పరుగులు చేశాడు. ఇందులో 6 శతకాలు, 47 అర్ధశతకాలు ఉన్నాయి.
* కెప్టెన్ గా 15 మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులను అందుకున్నాడు.
* ధోనీ నాయకత్వంలో 2007లో టీ20 ప్రపంచకప్‌, 2011లో ప్రపంచకప్‌, 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ అందుకుంది.
* టీమిండియాలో వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన సచిన్‌, గంగూలీ, రాహుల్ ద్రవిడ్ తరువాత ధోని నిలిచాడు.

చేరువలో ఉన్న రికార్డులు:

* ధోనీ మరో స్టంప్‌ ఔట్‌ చేస్తే అంతర్జాతీయ క్రికెట్ లో 100 స్టంపౌటుతో రికార్డు.
* ధోనీ ఇప్పటి వరకు వన్డేల్లో 72 సార్లు నాటౌట్‌గా నిలిచి.. షాన్‌ పొలాక్‌, చమిందావాస్ లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానం.
* మరో నాటౌటుతో వన్డేల్లోనే అత్యధికంగా నాటౌట్‌గా నిలిచిన ఆటగాడి రికార్డు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  India vs Sri Lanka  300 ODI match  dhoni 50 runs  Team India  cricket  

Other Articles