Kohli batting left-handed ahead of T20 లంక వీధుల్లో విరాటుడి సవ్యసాచత్త్వం..

Virat kohli bats left handed in sri lanka video goes viral

Virat Kohli, India vs Sri Lanka, Sri Lanka vs India, Indian Cricket Team, IND vs SL, Sachin Tendulkar, cricket news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

Team India skipper Virat Kohli-led India have been in fine form on the Sri Lanka tour, whitewashing the home side 3-0 in Tests and 5-0 in the ODI series.

లంక వీధుల్లో విరాటుడి సవ్యసాచత్త్వం..

Posted: 09/06/2017 07:29 PM IST
Virat kohli bats left handed in sri lanka video goes viral

శ్రీలంక పర్యటిస్తోన్న భారత క్రికెట్‌ జట్టు టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఆ తరువాత వన్డేలలో వైట్ వాస్ చేసింది. ఇక తాజాగా టీ20 మాత్రమే మిగిలివున్న తరుణంలో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తనసవ్యసాచత్త్వాన్ని ప్రదర్శించి.. లంకేయులను మ్యాచ్ కు ముందుగానే వణికిస్తున్నాడు. ఏకైక టీ20లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ స్వీప్ పై దృష్టి పెట్టిన విరాట్.. తన సవ్యసాచి టాలెంట్ ను ప్రదర్శించి అభిమానుల చేత ఔరా అనిపించాడు.

ఆదివారం జరిగిన చివరి వన్డే తరువాత కాస్త రిలాక్స్ అయిన విరాట్.. తన తీరిక సమయాన్ని కూడా క్రికెట్ కోసమే కేటాయించాడు. లంక వీధుల్లో చక్కెర్లు కొడుతుండగా అభిమానులు ఎదురై తమతో క్రికెట్ అడాలని కోరారు. ఈ క్రమంలో భారత క్రికెట్‌ జట్టు సారథి కోహ్లీ వారితో కలసి శ్రీలంక వీధుల్లో గల్లీ క్రికెట్‌ ఆడాడు. అయితే గల్లి అని అడాడో లేక.. టీ20ని దృష్టిలో పెట్టుకుని అడాడో తెలియదు కానీ.. కుడిచేతితో కాకుండా ఎడమ చేత్తో బ్యాటింగ్‌ చేసి స్థానికులను అబ్బురుపరిచాడు. అంతేకాదు తనలోని సవ్యసాచత్త్వాన్ని ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. మీరు ఓ లుకేయండీ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Team India skipper  Sports  team india  sachin tendulkar  cricket  

Other Articles