Sharjeel Khan gets a 5-year ban for spot-fixing పాక్ క్రికెటర్ షర్జీల్ ఖాన్ పై ఐదేళ్ల నిషేధం..

Pak cricketer sharjeel khan gets five year ban in spot fixing case

pakistan super league, spot-fixing scandal, sharjeel khan, pakistan cricket, pakistan cricket board, pcb, cricket, cricket news, latest sports news, sports news, latest news

Pakistani cricketer Sharjeel Khan was slapped with a five-year ban over charges of spot-fixing in the Pakistan Super League.

పాక్ క్రికెటర్ షర్జీల్ ఖాన్ పై ఐదేళ్ల నిషేధం..

Posted: 08/30/2017 06:14 PM IST
Pak cricketer sharjeel khan gets five year ban in spot fixing case

స్పాట్ ఫిక్సింగ్ కేసులో పాకిస్థాన్ క్రికెటర్ అడ్డంగా దొరికిపోగా అతనిపై గత కొన్నాళ్లుగా విచారణ జరిపిన త్రిసభ్య అవినీతి వ్యతిరేక ట్రిబ్యూనల్ ఇవాళ తీర్పును వెలువరించింది. పాకిస్థాన్ క్రికెటర్ షర్జీల్‌ ఖాన్ పై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. షర్జీల్ ఖాన్ క్రికెట్‌ ఆడకుండా అతడిపై ఐదేళ్ల పాటు నిషేధం విధించారు. ఈ ఏడాది నిర్వహించిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్‌)లో షర్జీల్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని ఆ దేశ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక ట్రైబ్యునల్ ధ్రువీకరించి శిక్ష విధించింది. రెండున్నరేళ్ల చొప్పున రెండు దఫాలుగా అతడిపై నిషేధం కొనసాగుతుంది.

భారత్ తరహాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న తొలిసారే పాకిస్థాన్ పీఎస్ఎల్ కు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. కాగా షర్జీల్ ఖాన్ పూ ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుంచే నిషేధ కాలం మొదలైనట్టు టైబ్యునల్‌ పేర్కొనడంతో ఇప్పటికే ఆయన సుమారు అరు నెలల శిక్ష కాలం ముగించేసినట్లు అయ్యింది. ఫిక్సింగ్ కు పాల్పడ్డ మరో క్రికెటర్ ఖలిద్ లతీఫ్ పై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సంవత్సరం నిర్వహించిన పీఎస్‌ఎల్ లో షర్జీల్ బుకీలను కలిశాడు. వారి సూచనల ప్రకారం రెండు బంతుల్ని డాట్ చేశాడు. విచారణలో నేరం అంగీకరించాడు. పాక్‌ క్రికెటర్లకు ఫిక్సింగ్‌ కొత్తేమీ కాదు. గతంలో సల్మాన్ భట్, మహ్మద్ ఆమిర్, మహ్మద్ ఆసిఫ్ వంటివారు ఫిక్సింగ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles