మాజీ మెచ్చిన కోహ్లీ బెస్టు ఇన్నింగ్స్ అదేనట.. Ganguly rates Kohli's 133 as his favourite innings

Ganguly rates kohli s 133 against sri lanka at hobart as his favourite innings

Virat Kohli, Sourav Ganguly, India vs Sri Lanka, Hobart ODI, one-day international, Virat Kohli best innings, cricket, India cricket. cricket, cricket news, sports, sports news

Virat Kohli made an impression in International cricket, first in the limited-overs format of the game and then in the longer version of the game.

మాజీ మెచ్చిన కోహ్లీ బెస్టు ఇన్నింగ్స్ అదేనట..

Posted: 10/18/2016 05:31 PM IST
Ganguly rates kohli s 133 against sri lanka at hobart as his favourite innings

టీమిండియా క్రికెట్ లో దిగ్గజ అటగాడు సచిన్ టెండుల్కర్ తరువాత అంతటి క్రేజ్ సంపాదించిన క్రికెటర్ విరాట్ కోహ్లి. తాను నమోదు చేస్తున్న సరికోత్త రికార్డులతో భారత క్రికెట్లో స్టార్ ఆటగాడిగా ఎదిగి.. ఇటు భారతీయ అభిమానులతో పాటు అటు యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానుల ప్రశంసలతో మునిగిపోయాడు. క్రికెట్ ప్రపంచంలోని దిగ్గజాలు కూడా కోహ్లీ ప్రతిభను, అటతీరును నిత్యం ప్రశంసిస్తూనే వుంటాయి. ప్రత్యేకంగా లక్ష్య ఛేదనలో కోహ్లి రికార్డు అమోఘమని శ్లాఘించారు కూడా.

ఈ క్రమంలోనే విరాట్ వన్డేల్లో తనకు బెస్టు ఇన్నింగ్స్ గా అనిపించింది మాత్రం హోబర్టు వన్డే మాత్రమేనని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. 2013లో ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో విరాట్ చేసిన 133 పరుగులే తాను చూసిన విరాట్ వన్డే ఇన్నింగ్స్లో అత్యుత్తమం అంటూ గంగూలీ పేర్కొన్నాడు. ఈ రోజుకి శ్రీలంకపై సాధించిన విరాట్ ఆ ఇన్నింగ్సే తనకు అత్యంత ఇష్టమని గంగూలీ పేర్కొన్నాడు. శ్రీలంక 321 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచినప్పుడు విరాట్ ఆడిన తీరు అమోఘమన్నాడు.

ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లి 86 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 133 పరుగులతో అజేయంగా నిలిచాడు. శ్రీలంక ప్రధాన బౌలర్ మలింగా వేసిన ఒక ఓవర్ లో 24 పరుగులను విరాట్ పిండుకోవడంతో పాటు మలింగా సైన్యాన్ని ఊచకోత కోసిన తీరుకూడా తనకు నచ్చిందన్నాడు. తొలి బంతికి  రెండు పరుగులు తీసిన కోహ్లి.. ఆ తరువాత బంతికి సిక్స్ కొట్టాడు. ఆపై మిగతా నాలుగు బంతుల్ని ఫోర్లుగా మలిచాడు. మలింగా వేసిన 15 బంతుల్ని ఎదుర్కొన్న కోహ్లి 44 పరుగులు చేసి తన అదిపత్యాన్ని ప్రదర్శించాడని చెప్పాడు. విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పై నమోదు చేసిన 183 వ్యక్తిగత పరుగుల్ని కూడా గంగూలీ పక్కన పెట్టేశాడు. అంతలా ఈ మ్యాచ్ తనకు నచ్చిందన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sourav Ganguly  Virat Kohli  Sri Lanka  one-day international  best innings cricket  

Other Articles