రిషబ్ పంత్ ఖాతాలో మేడిన్ ట్రిఫుల్ Pant focused on road ahead after maiden triple-ton

Pant focused on road ahead after maiden triple ton

Rishabh Pant, fourth-youngest triple-centurion in first-class cricket, Toughened Pant reaps rewards of flexibility, Rishabh Pant, Maharashtra v Delhi at Mumbai, Ranji Trophy, Indian Domestic Season, India cricket. cricket, cricket news, sports, sports news

Rishabh Pant has already achieved the goal in only his second match, but wants to continue scoring as much as possible

రిషబ్ పంత్ ఖాతాలో మేడిన్ ట్రిఫుల్

Posted: 10/18/2016 04:44 PM IST
Pant focused on road ahead after maiden triple ton

రిషబ్ పంత్.. దేశవాళీ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ జట్టుకు ఎంపిక కాకుండానే అటు కామేంటేటర్ల చేత, ఇటు అభిమానుల చేత, మరోవైపు సహచర అటగాళ్ల చేతకూడా ఔరా అనిపించుకుంటున్నాడు. గతేడాదే ఫస్ట్ క్లాస్ల్ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ యువ క్రికెటర్ అవకాశం దొరికిందే తడవుగా తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఈ ఏడాది తన ఖాతాలో రెండు రికార్డులను వేసుకున్న అతడు సంతోషంగా వున్నాడు.

అవేంటనేగా మీ సందేహం. ఒకటి అండర్-19 వరల్డ్ కప్ లో18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించడమైతే, ఈ రంజీ సీజన్లో ట్రిపుల్ సెంచరీతో మెరిసి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోఆ ఘనతను సాధించిన నాల్గో ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. అయితే తాను సాధించిన ట్రిపుల్ పై రిషబ్ పంత్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తాను టార్గెట్ పెట్టుకున్న దానికంటే మరోకటి అదనంగా లభించడంతో అనందానికి అవధులు లేవని చెబుతున్నాడు.

ఈ రంజీ సీజన్ లో డబుల్ సెంచరీ సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నానని, దానిని సాధించాలని కృతనిశ్చయంతో వున్నానని.. దానిని సాధించే క్రమంలో తన ఖాతాలోకి ట్రిపుల్ సెంచరీ వచ్చి చేరిందన్నాడు. ఇది నిజంగా చాలా ఆనందం ఉంది. చాలాసార్లు 150 పరుగుల మార్కుకు చేరిన తాను.. డబుల్ చేయాలని సీజన్ కు ముందే అనుకున్నాడు.దానిన సాధించే క్రమంలో తనకు ట్రిఫుల్ సెంచరీ చేయడం అనందాన్నిచ్చిందన్నాడు, అయితే ఇందుకోసం తాను ఎటువంటి దూకుడును ప్రదర్శించలేదని.. తన సహజసిద్ధమైన ఆటనే ఆడానని చెప్పాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rishabh Pant  maiden triple-ton  Ranji Trophy  first-class cricket  cricket  

Other Articles