తప్పిదాలను అధిగమిస్తాం.. తిరిగి పుంజుకుంటాం.. Latham a shining light for Black Caps

Record breaking tom latham left to explain team s odi failures

India-New Zealand, Tom Latham, Tom Latham new zealand, tim southee, tim southee new zealand, Kane Williamson, India-New Zealand odi series, new zealand hope, nzl come back, cricket, sports

Black Caps batsman Tom Latham talks about the team's scrap to 190 and struggles to get to grips with Indian conditions.

తప్పిదాలను అధిగమిస్తాం.. తిరిగి పుంజుకుంటాం..

Posted: 10/17/2016 05:31 PM IST
Record breaking tom latham left to explain team s odi failures

భారత పర్యటనలో వున్న న్యూజీలాండ్ జట్టులో అదనపు జోష్ తో అడుతున్న క్రికెటర్, ఓపెనర్ టామ్ లాథమ్ తమ జట్టు తప్పిధాలను అధిమిస్తే తమదే విజయమని చెప్పుకోచ్చారు. తాము తిరిగి పుంజుకుంటామని చెప్పారు. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా తాము అడిన తొలి మ్యాచ్ లో ఓటమితో టీమిండియా పూర్తిగా సిరీస్ నే గెలించిందన్న భావన సరైంది కాదన్నాడు. తాము తిరిగి పుంజుకుని అతిథ్య జట్టుపై విజయాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

ఇంకా నాలుగు వన్డే మ్యాచ్లు ఉన్నందున వాటిలో ఏమైనా జరగొచ్చన్నాడు. గత కొన్ని వారాల నుంచి భారత్లోని పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసినట్లు లాధమ్ తెలిపాడు. కాగా, దురదృష్టవశాత్తూ తొలి వన్డేలో పోరాడే స్కోరు చేయలేకపోవడంతోనే ఓటమి చెందామని అయన అభిప్రాయపడ్డాడు. దీనికి తోడు తమ జట్టు కొన్ని తప్పిదాలను చేసిందని కూడా అంగీకరించాడు.

అయితే వాటిని రానున్న నాలుగు వన్డే మ్యాచ్ లలో సవరించుకుంటామని, కొన్ని బలహీనతలను కూడా అధిగమించి రాణిస్తామన్నాడు. తాము చేసిన తప్పుల నుంచి బయట పడతామని అనుకుంటున్నామని లాధమ్ తెలిపాడు. తన సహచర ఆటగాడు టిమ్ సౌతీపై లాధమ్ ప్రశంసలు కురిపించాడు. తనకు సాయంగా నిలిచిన సౌతీ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడం నిజంగా శుభపరిణామన్నాడు. జట్టు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సౌతీ అండగా నిలవడంతో 190 పరుగుల స్కోరును బోర్డుపై నిలపగలిగామన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  new zealand  one-day series  sourav ganguly  cricket  

Other Articles