BCCI clears Indian Women for participation in overseas leagues

Bcci nod for women in foreign leagues

indias womens cricket team, bcci, mithali raj, jhulan goswami, wbbl, australia, england, ecb, ca, sports news, sports, cricket news, cricket

India's women cricketers can now play in overseas leagues in Australia and England, subject to their contracts being approved by the BCCI.

మహిళా క్రికెటర్లకు బిసీసీఐ శుభవార్త..

Posted: 06/03/2016 06:43 PM IST
Bcci nod for women in foreign leagues

భారత మహిళా క్రికెటర్లకు కూడా మంచి రోజులు తీసుకువస్తానని ఇటీవల బీసిసిఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అనురాగ్ శర్మ చెప్పినట్లుగానే వారికి శుభవార్తను అందించారు, విదేశాల్లో నిర్వహిస్తున్న లీగ్లో పాల్గొనాలనుకునే భారత మహిళా క్రికెటర్లకు ఇది కలసివచ్చే అవకాశం. ఇంగ్లండ్(మహిళల సూపర్ లీగ్), ఆస్ట్రేలియా(మహిళల బిగ్ బాష్ లీగ్)లలో నిర్వహించే లీగ్లో ఇక నుంచి భారత స్టార్ మహిళా క్రికెటర్లు ఆడేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అనుమతినిచ్చింది.

ఈ మేరకు మహిళల క్రికెట్ సమావేశంలో నిబంధనలను సులభతరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో స్టార్ క్రికెటర్స్ మిథాలీ రాజ్,జులన్ గోస్వామి లాంటి వారికి ఈ నిర్ణయం ఆర్థికంగా లాభం చేకూర్చనుంది.అయితే బీసీసీఐ ఆల్యస్యంగా నిర్ణయం తీసుకోవడంతో ఈ ఏడాది జూలై 30 నుంచి ఆగస్టు 14 వరకూ జరిగే డబ్యుఎస్ఎల్ తొలి సీజన్లో ఆడే అవకాశం తక్కువగా కనబడుతోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  India  big bash league  

Other Articles