West Indies keen to ride World T20 wave in tri-series

Simmons staying focused on tri nation series

west indies chief coach phil simmons, phil simmons, west indies, tri-nations series, australia, south africa, west indies, australia vs west indies, west indies vs south africa,

West Indies head coach Phil Simmons has downplayed their chances in the tri-nations series starting here on Friday, but said it would be a mistake to underestimate his side.

ట్రై సీరీస్ లో విండీస్ ఆటతీరుపై అందోళన

Posted: 06/02/2016 06:15 PM IST
Simmons staying focused on tri nation series

ఐపీఎల్ లో ఫుల్ జోష్ తో రాణించిన విండీస్ ఆటగాళ్లు.. త్వరలో తమ దేశంలో జరగనున్న ముక్కోణపు సీరీస్ లో రాణించే విషయమై వెస్టీండీస్ ప్రధాన కోచ్ పిల్ సిమన్స్ అందోళన వ్యక్తం చేశారు. ఈ సిరీస్ లో అస్ట్రేలియా జట్టు ఫేవరేట్ గా బరిలోకి దిగుతుందని ఆయన నిర్మోహమాటంగా చెప్పేశారు. అలా అంటూనే తమ జట్టు శక్తిసామర్థ్యాలను తక్కువగా అంచనా వేయలేమని కూడా అన్నారు. ఐపీఎల్ గత రెండు నేలలుగా ఆడిన తమ జట్టు సభ్యుల పిట్ నెస్ పై ఆయన కోంత అందోళన వ్యక్తం చేశారు.

ముక్కోణపు సిరీస్ కు విండీస్ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని అంటునే.. వారి ఆటతీరుపై అయన కొంత అనుమానాలను వ్యక్తం చేశాడు. పలువురు విధ్వంసకర బ్యాట్స్ మెన్లు జట్టుకు దూరం కావడం కూడా విండీస్ ఇబ్బందులను ఎదుర్కోవచ్చునని అన్నారు. బౌలింగ్ యాక్షన్ పై ఆరోపణలతో కొన్ని రోజులుగా జట్టులో లేని మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ కూడా ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడాడు. అతనికి క్లీన్ చిట్ రావడంతో సత్తా చాటడానికి మరోసారి సిద్ధమయ్యాడు. ఇండియాలో ఆడిన ఐపీఎల్ మ్యాచ్ ల ప్రభావం కరీబియన్ ఆటగాళ్లపై ఇంకా ఉంటుందని, వారు వంద శాతం ఫిట్ గా లేరని తెలిపాడు.

తమ ఆటగాళ్లు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లతో జూన్ 3-26 మధ్య మ్యాచ్ లు ఆడనున్నారు. అయితే విండీస్ విధ్వంసక ఆటగాళ్లు ఈ టోర్నీలో సింగిల్స్ తీయడానికి చాలా హార్డ్ వర్క్ చేయాలని కోచ్ అభిప్రాయపడ్డాడు. పరుగుల ప్రవాహంలో మునిగిపోయే ఐపీఎల్ తర్వాత జరిగే సిరీస్ కావడంతో కెప్టెన్ జాసన్ హోల్డర్, కీరన్ పోలార్డ్, కార్లోస్ బ్రాత్ వైట్, ఇతర ముఖ్యమైన ఆటగాళ్ల విషయంలో కోచ్ కాస్త ఆందోళన చెందుతున్నాడు. ముక్కోణపు టోర్నీలో సునీల్ నరైన్ అద్భుతంగా రాణిస్తాడని సిమన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL  tri nation series  West Indies  coach Simmons  australia  south africa  

Other Articles