ప్రపంచకప్ టోర్నమెంటులో టాప్ ఎనమిది జట్ల మధ్య వచ్చే ఏడాది జూన్ లో జరగనున్న ఛాంఫియన్స్ ట్రాఫీలో, అభిమానులు ఎంచక్కా అస్వాధించేందుకు, కిక్కును పంచడం కోసమే తాము కావాలనే కొన్ని జట్లను ఒకే పూల్ లో వేసినట్ల ఐసీపీ సీఈవో డేవ్ రిచర్డ్ సన్ అంగీకరించారు. అయితే దీని పట్ల సంప్రాదాయ క్రికెట్ కు రానున్న కాలంలో బీటాలు వారుతాయన్న వాదననలను అయన తోసిపుచ్చారు. గ్రూపుల్లో ఉన్న దేశాల ర్యాంకులను కలిపి చూస్తే.. రెండు గ్రూపుల పాయింట్లు సమానంగా ఉన్నాయన్నారు. రెండింటి మధ్య సరితూకం ఉన్నంతవరకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెప్పారు.
ముఖ్యంగా క్రికెట్ లో ధాయాదులుగా అభివర్ణించబడే జట్లు.. టీమిండియా, పాకిస్థాన్.. అటు ఇంగ్లాండ్ అస్ట్రేలియాలను ఒకే పూల్ లో వేశామని తెలిపారు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో దానిని వీక్షించడానికి యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానులు అసక్తి చూపుతారని, గత వరల్డ్ కప్ లో ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు సుమారుగా 100 కోట్ల మంది టీవీలకు హత్తుకుపోయారన్న విషయాన్ని మర్చిపోరాదని, అందుకనే తాము కావాలనే ఈ రెండు జట్లను ఒకే గ్రూపులో ఉండేలా డ్రాలను కొద్దిగా అటూ ఇటూ చేస్తున్నట్లు సాక్షాత్తు ఆయన చెప్పారు.
2017లో ఇంగ్లండ్‌లో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీలో భారత, పాక్ జట్ల మధ్యనే తొలి మ్యాచ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఇటీవలే విడుదలైంది. సుమారు ఏడాది తర్వాత.. జూన్ 4వ తేదీన ఎడ్జ్‌బాస్టన్‌లో ఈ మ్యాచ్ ఉంటుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు ఉండేలా చూడాలనే తాము ప్రయత్నిస్తామని, అందులో అనుమానం అక్కర్లేదని చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటారని, అలాంటి మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమైతే మంచి కిక్ వస్తుందని ఆయన అన్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more