BCCI seeking 'Hindi speaking' head coach for Indian cricket team

Hunt for india coach bcci outlines what it is looking for

Team India, India coach, BCCI, Ravi Shastri, Rahul Dravid, Board of Control for Cricket in India, BCCI, 2015 ICC World Cup, Duncan Fletcher, Sanjay Bangar, cricket news

The BCCI today advertised for the national team's head coach position which has been vacant since Zimbabwean Duncan Fletcher's contract ended after the 2015 ICC World Cup.

హిందీ వచ్చిన క్రికెట్ కోచ్ కోసం బిసిసిఐ ప్రకటన

Posted: 06/02/2016 12:15 PM IST
Hunt for india coach bcci outlines what it is looking for

టీమిండియా కోచ్‌ బరిలో నిలచేందుకు ఇప్పటికే పలువురు పేర్లు పరిశీలనలో వుండగా.. వాటన్నింటినీ తోసిపుచ్చుతూ.. బీసిసిఐ కొత్తగా ఒక ప్రకటనను విడుదల చేసింది. టీమ్ ఇండియాకు రానున్న ఐసిసీ ప్రపంచ కప్ వరకు కోచ్ గా పగ్గాలు చేపట్టేందుకు తగిన అర్హతలున్న అభ్యర్థులు కావాలంటూ బీసీసీఐ తన ప్రకటనలో పేర్కోంది. ఐసీసీలో పూర్తిస్థాయి సభ్యదేశం నిర్వహించిన సర్టిఫికేషన్ పరీక్ష పాసై, సర్టిఫికెట్ ఉన్నవాళ్లు అర్హులని అందులో తెలిపింది.

అయితే.. భారతజట్టు తరఫున ఇంతకుముందు ఆడిన వాళ్లయితే ఇలాంటి సర్టిఫికెట్ లేకపోయినా పర్వాలేదని చెప్పింది. దాంతో టీమిండియా మాజీ కెప్టెన్లు రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ లాంటివాళ్లకు మార్గం సుగమమైంది. ఐసీసీ సభ్యదేశాలలో ఏదైనా జట్టుకు ఫస్ట్‌క్లాస్ లేదా అంతర్జాతీయ స్థాయిలో విజయవంతంగా కోచ్ పదవి నిర్వహించి ఉండాలని కూడా బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది. వీటన్నింటితో పాటు.. కోచ్‌గా వచ్చేవాళ్లు క్రీడాకారులతో మంచి ఇంగ్లిషులో చెప్పగలిగేలా ఉండాలని పేర్కొంది. దాంతోపాటు హిందీలోను, ఇతర ప్రాంతీయ భాషల్లోను కూడా మాట్లాడగలిగి ఉంటే మంచిదని చెప్పింది.

క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలోను (టెస్టు, వన్డే, టి20) టీమిండియాకు సమర్థ నాయకత్వం అందించాలని, ఆటగాళ్ల వ్యక్తిగత పెర్ఫార్మెన్సును అంచనా వేయడంతో పాటు బోర్డుకు నివేదికలు ఇవ్వాల్సి ఉంటుందని, బోర్డు మొత్తం జట్టు సామర్థ్యాన్ని అంచనా వేస్తుందని ఆ ప్రకటనలో తెలిపారు. టీమిండియాను అగ్రస్థానానికి చేర్చేందుకు కావల్సిన అన్ని ప్రణాళికలు రచించాలని చెప్పారు. అయితే.. ఇంతకుముందు గానీ, ఇప్పుడు గానీ సదరు అభ్యర్థి ఐసీసీ, దాని అనుబంధ బోర్డుల సభ్య దేశాలతో ఎలాంటి వివాదాల్లోను ఉండి ఉండకూడదని, రికార్డు క్లీన్‌గా ఉండాలని స్పష్టం చేసింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : team india  coach  bcci  hindi mandatory  icc membership  indian  

Other Articles