Angelique Kerber stuns Serena Williams to win title

Angelique kerber stuns serena williams to win title

Angelique Kerber, Angelique Kerber Win, Angelique Kerber Vs Serena Williams, Australian Open

It may not have been an upset in the same league as the U.S. Open but what happened at the Australian Open on Saturday perhaps wasn't far off. Angelique Kerber stunned Serena Williams in a 6-4 3-6 6-4 thriller to open her grand slam account and deprive the American of a 22nd title at a major that would have tied Steffi Graf for the Open Era lead.

చరిత్ర సృష్టించిన ఏంజెలికా కెర్బర్.. సెరెనాకు షాక్

Posted: 01/31/2016 03:31 PM IST
Angelique kerber stuns serena williams to win title

జర్మన్ తార ఏంజెలికా కెర్బర్ పెను సంచలనం నమోదుచేసింది. ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో టాప్‌సీడ్, ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్‌ను 6-4, 3-6, 6-4 స్కోరుతో ఓడించి కెరీర్‌లో తొలిగ్రాండ్‌స్లామ్ కైవసం చేసుకుంది. మెల్‌బోర్న్‌పార్క్‌లో ఫైనల్‌కు చేరిన ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచిన సెరెనా విలియమ్స్ జోరుకు కెర్బర్ బ్రేకులు వేసింది. దీంతో 22వ గ్రాండ్‌స్లామ్ విజయంతో ఓపెన్ ఎరాలో 22 గ్రాండ్‌స్లామ్స్ టైటిల్స్ సాధించిన జర్మన్ టెన్నిస్ గ్రేట్ స్టెఫీగ్రాఫ్ సరసన నిలవాలన్న సెరెనా కల చెదిరింది. 34 ఏండ్ల సెరెనా విలియమ్స్ గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిల్స్ సాధించి యూఎస్ ఓపెన్ సెమీస్‌లో రాబెర్టో విన్సీ చేతిలో పరాజయం పాలైంది. దీంతో 22వ టైటిల్ అందకుండా ఊరించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ చేరుకున్నా జర్మన్ తార చేతిలో ఫైనల్లో పరాజయం పాలవడంతో మరోసారి 22వ టైటిల్ అందకుండా చేజారింది.

గతేడాది ఆస్ట్రేలియన ఓపెన్‌టోర్నీలో తొలిరౌండ్‌లోనే వెనుదిరిగిన కెర్బర్ ఈ ఏడు క్వార్టర్‌ఫైనల్లో రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ బెలారస్‌భామ అజరెంకా చేతిలో ఓడిపోయే స్థితిలో పట్టువదలకుండా పోరాడి గెలుపుతో పూర్తి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. సెమీఫైనల్లోనూ బ్రిటన్ భామ జోహాన్నా కాంటాను ఓడించి ఫైనల్ చేరింది. ఫైనల్లోనూ ఏ దశలోనూ 21సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ సెరెనా విలియమ్స్‌కు మ్యాచ్‌లో పుంజుకునే అవకాశాన్ని కెర్బర్ ఇవ్వలేదు. మ్యాచ్ ఆసాంతంలో కేవలం 13 అనవసర తప్పిదాలే చేయడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles