U Mumba thrilling win over Telugu Titans

U mumba thrilling win over telugu titans

Telugu Titans, U Mumba, Telugu Titans in first match

Defending champions U Mumba managed to pull off an exciting 27-25 win over hosts Telugu Titans to kick off their campaign in the Pro Kabaddi League on a rousing note at the Rajiv Gandhi Indoor Stadium in Visakhapatnam on Saturday. The Mumbai franchise were leading 18-8 in the first half, but lost the grip in the second half of the game, which they should have won comfortably.

పొరాడి ఓడిన తెలుగు టైటాన్స్

Posted: 01/31/2016 03:33 PM IST
U mumba thrilling win over telugu titans

ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ – 3 ఆరంభం అదిరిపోయింది. తొలి మ్యాచే అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. నరాలు తెగే ఉత్కంఠతో జరిగిన తొలి మ్యాచ్ లో ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్ పోరాడి ఓడింది. రెండు పాయింట్ల తేడాతో పరాజయం పాలైంది. విశాఖపట్నంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబా.. 27-25తో తెలుగు టైటాన్స్ పై ఘన విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో 12-8తో ఆధిక్యంలో ఉన్న ముంబా జట్టు.. ద్వితీయార్ధం ఆరంభంలో జోరు పెంచింది. ఒక దశలో 22-10 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో తెలుగు టైటాన్స్ రైడర్ సుకేశ్ హెగ్డే అద్భుతంగా ఆడాడు.

వెంటవెంటనే పాయింట్లు సాధించాడు. ఇక రాహుల్ చౌదరి కూడా స్థాయికి తగ్గట్లుగా ఆడటంతో... చివరి క్షణాల్లో తెలుగు జట్టు ముంబా స్కోర్ కు చేరువైంది. 27-24 ఆధిక్యంలో ఉన్న దశలో ముంబా జట్టు కొంత సమయం వృథా చేయడంతో పాటు పాయింట్లు ఇవ్వకుండా తెలివిగా ఆడి మ్యాచ్ చేజారకుండా చూసుకుంది. సుకేశ్ హెగ్డే 9 పాయింట్లు సాధించగా... రాహుల్ 6 పాయింట్లు తెచ్చాడు. డిఫెన్స్లో రాణించిన ధర్మరాజ్ 4 పాయింట్లు సాధించాడు. ముంబా తరఫున కెప్టెన్ అనూప్ 6 పాయింట్లు సాధించాడు. రిశాంక్ 7 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ఇదే వేదికగా జరిగిన మరో మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ 35-29తో దబాంగ్ ఢిల్లీపై నెగ్గింది. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇద్దరూ మ్యాచ్ మొత్తం వీక్షించారు. ఇక తెలుగు టైటాన్స్ బ్రాండ్ అంబాసిడర్ దగ్గుబాటి రానా సందడి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telugu Titans  U Mumba  Telugu Titans in first match  

Other Articles