Smith anger on behaviour of Virat Kohli in Second T20 match

Smith anger on behaviour of virat kohli in second t20 match

Virat kohli, Smith, Australi, India, Team India, Bowlers

Star Indian batsman Virat Kohli on Friday explained what was behind his fiery 'send-off' of Steven Smith during the first T20 International earlier this week and said that it had nothing to do with the Australian wearing a microphone. Kohli had exchanged words with Smith after taking a catch to dismiss the Australian during the first T20 International at Adelaide Oval on Tuesday.

కోహ్లీ ప్రవర్తన మీద స్మిత్ ఆవేదన

Posted: 01/30/2016 04:04 PM IST
Smith anger on behaviour of virat kohli in second t20 match

కోహ్లీ ఆష్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లో దూకుడు మీద ఆడుతున్నాడు. అయితే ఆటలోనే కాకుండా ఎదుటి ఆటగాళ్లను వెక్కిరించడంలో కూడా దూకుడు మీదున్నారని స్మిత్ ఆరోపిస్తున్నారు. తాను ఔటైన తర్వాత విరాట్ కోహ్లీ అసహ్యంగా ప్రవర్తించాడని.. అలా ప్రవర్తించాల్సిన అవసరం లేదని స్మిత్ అభప్రాయపడ్డారు. గతంలో టీమిండియా ఆటగాళ్లలో గంగూలీ కూడా అంతే.. దూకుడుగా ఆడటమే కాకుండా ఆటగాళ్లతో వ్యవహరించే తీరు కూడా చాలా విమర్శలకు తెర తీసింది. అయితే తాజాగా కోహ్లీ కూడా అదే బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది.  

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న స్మిత్‌ కాసేపు టీవీ కామెంటేటర్లతో లైవ్‌గా ముచ్చటించాడు. ఆ వెంటనే అతను కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో పెవిలియన్ దిశగా వెళ్తున్న స్మిత్‌తో కోహ్లి నోరుమూసుకో అన్నట్లు చేయి చూపించాడు. అయితే దీని మీద స్మిత్ తన ఆవేదన వ్యక్తం చేశారు. అలా ప్రవర్తించాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే మన బౌలర్ల పట్ల స్మిత్ దురుసు వ్యాఖ్యలు చేయడంతోనే అతనితో సంవాదం పెట్టుకున్నానని, అతని వద్ద లైవ్ మైక్ ఉన్న విషయం కూడా తనకు తెలియదని కోహ్లి వివరణ ఇచ్చాడు. కాగా, స్మిత్ ఔటయ్యేందుకు కారణమైన ఈ లెటెస్ట్‌ టెక్నాలజీపై క్రికెట్ దిగ్గజాలు మండిపడుతున్నారు. మ్యాచ్ మధ్యలో టీవీ కామెంటేటర్లతో మాట్లాడే ఈ పద్ధతి క్రికెట్‌ను ధంస్వం చేస్తోందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat kohli  Smith  Australi  India  Team India  Bowlers  

Other Articles