Ajinkya Rahane a complete batsman: Laxman, Kapil

Kapil dev compares yuvraj singh to maradona mcenroe

Yuvraj Singh, T20, cricket, kapil dev, yuvraj singh, india australia, India Versus Australia, IND vs AUS, India vs Australia, world t20, AUS vs IND, world twenty20, Twenty20, t20 world cup, Diego Maradona, Australia Vs India 2016,Cricket Yuvraj Singh Disappointed at Not Making Cut for ODIs in Australia latest Australia Vs India 2016 news,india,Australia,tewnty-20 worldcup

Former India captain Kapil Dev on Wednesday lauded Yuvraj Singh’s inclusion in the Indian T20 team terming him as a “crowdpuller like John McEnroe”.

యువరాజ్ జనాభిమానం.. అజింక్య ఆట నేర్పరితనం

Posted: 12/24/2015 01:52 PM IST
Kapil dev compares yuvraj singh to maradona mcenroe

టి20 జట్టులో డాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్‌ను చేర్చడాన్ని బౌలింగ్ దిగ్గజం కపిల్ దేవ్ స్వాగతించారు. జాన్ మెకన్రో, మారడోనాలాగా యువీకి జనాభిమానం చాలా ఎక్కువని అభివర్ణించారు. ‘యువీ చాలా ఉత్సాహవంతమైన క్రికెటర్. మెకన్రో, మారడోనాలాగే తనకీ అభిమానులు చాలా ఎక్కువ. కేవలం వీళ్ల ఆటను చూడటానికే జనాలు వస్తారు. యువరాజ్ కూడా ఆ కోవలోకే వస్తాడు. తన బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో అభిమానులను మైదానానికి రప్పిస్తాడు. అందుకే అతను నిఖార్సైన మ్యాచ్ విన్నర్. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు’ అని కపిల్ పేర్కొన్నారు.

ఇక అజింక్య రహానే పూర్తిస్థాయి బ్యాట్స్ మన్ అంటూ కపిల్ దేవ్ సహా దిగ్గజ క్రికెటర్ వివీఎస్ లక్ష్మణ్ కూడా కొనియాడారు. రహానేపై భారత్ బ్యాటింగ్ యూనిట్ అధారపడవచ్చని కూడా వారు ధీమా వ్యక్తం చేశారు. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో దక్షిణాఫ్రికాపై ఒక టెస్టులోని రెండు ఇన్నింగ్స్ లో రహానే సాధించిన రెండు శతకాలు ఆయనలోని ఫోకస్, ఖచ్చితత్వాన్ని వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. కపిల్, లక్ష్మణ్ లు టి20 జట్టుకు ధోనిని కెప్టెన్‌గా నియమించడం, పేసర్ల పట్ల విరాట్ దృక్పథాన్ని కూడా ఈ మాజీలు ప్రశంసించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yuvraj Singh  india  kapil dev  Australia  tewnty-20 world cup  

Other Articles