Conscious Yuvraj Singh Aims to Make The Most of Twenty20 Selection

Yuvraj singh confident of doing well in australia

yuvraj singh, yuvraj singh india, yuvraj singh cricket, yuvi, india cricket team, india cricket, cricket team, india vs australia, australia vs india, ind vs aus, aus vs ind, india australia, india vs australia schedule, cricket news

Yuvraj Singh, who is back in the Indian squad for the T20 leg of the tour to Australia, is confident of doing well Down Under

అస్ట్రేలియా సిరీస్ లో సత్తా చాటుతానన్న యువరాజ్

Posted: 12/25/2015 08:03 PM IST
Yuvraj singh confident of doing well in australia

వచ్చే నెలలో ఆసీస్ లో జరుగనున్నసిరీస్ లో సత్తా చాటుతానని ఇటీవల భారత జాతీయ క్రికెట్ జట్టులో పునరాగమనం చేసిన స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దాదాపు ఏడాదిన్నర కాలంగా తాను ఫిట్ నెస్ కోసం చాలా కష్టించినట్లు యువరాజ్ తెలిపాడు. తాను పడ్డకష్టం ఆడబోయే సిరీస్ లో కచ్చితమైన ఫలితం ఇస్తుందని యువీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
 
తాజాగా బీసిసీఐ టీవీతో మాట్లాడిన యువరాజ్.. తిరిగి జాతీయ జట్టులోకి రావడం పట్ల ఆనంద వ్యక్తం చేశాడు. 2007లో ట్వంటీ వరల్డ్ కప్ ను భారత్ గెలిచిన క్షణాలు చాలా ఆనందాన్నివ్వగా.. గతేడాది మాత్రం తన మనసును ఎక్కువగా గాయపరిచిందని తెలిపాడు. ప్రత్యేకంగా ట్వంటీ 20 వరల్డ్ కప్ పైనల్ లో తాను ఆడిన తీరు ఇప్పటికీ కలచి వేస్తూనే ఉందన్నాడు.

శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో .. చివరి 21 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేయడం తనను ఎక్కువ వేదనకు గురి చేసిందన్నాడు. కాగా, ఆటను ఆస్వాదించినంత కాలం ఆడుతుంటానని యువీ మరోసారి స్పష్టం చేశాడు. ప్రధానంగా సాధ్యమైనన్ని ట్వంటీ 20 మ్యాచ్ లను ఆడాలనుకుంటున్నట్లు యువీ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  yuvraj singh  2014  batting  comeback  world t20  t20 world cup  

Other Articles