BCCI launches specially-minted toss coin for India-South Africa series

Bcci launches special toss coin for india south africa series

india south africa, south africa india, india vs south africa, india south africa t20, t20 india south africa, BCCI, Mahatama Gandhi, India-South Africa cricket series, special toss coin, cricket news, cricket

BCCI launches specially-minted toss coin for India-South Africa series. The coin has the photographs of Mahatma Gandhi and Nelson Mandela laser engraved on it.

సఫారీలతో సిరీస్ కు బిసిసిఐ ప్రత్యేకంగా టాస్ కాయిన్

Posted: 10/02/2015 06:32 PM IST
Bcci launches special toss coin for india south africa series

జాతిపిత మహాత్మా గాంధీ మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ 146వ జయంతిని పురస్కరించుకుని ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న ట్వంటీ-20 సిరీస్ తొలి మ్యాచ్ సందర్భంగా బారత క్రికెట్ నియంత్రణ మండలి నూతన టాస్ కాయిన్ ను సిద్దం చేసింది. భారత్-దక్షిణాఫ్రికా క్రికెట్ సిరీస్ కోసం బీసీసీఐ ప్రత్యేకంగా ీ టాస్ కాయిన్ను రూపొందించింది. 20 గ్రాముల బరువు గల ఈ నాణెమును స్వచ్ఛమైన వెండితో బంగారు పూత పూసి తయారు చేయించారు. దీనిపై మహత్మా గాంధీ, దక్షిణాఫ్రికా నల్లసూరీడు నెల్సన్ మండేలా చిత్రాలను ముద్రించినట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలియజేసింది.

నాణెం బొమ్మ భాగంపై గాంధీ, మండేలా చిత్రాలను, బొరుసు భాగంపై భారత్, క్రికెట్ సిరీస్ లోగోను ముద్రించారు. శుక్రవారం భారత్, దక్షిణాఫ్రికా ద్వైపాక్షిక సిరీస్ ప్రారంభంకానుంది. రాత్రి 7 గంటల నుంచి ధర్మశాలలో ఇరు జట్ల మధ్య తొలి టి-20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సందర్భంగా భారత్, దక్షిణాఫ్రికా కెప్టెన్లు ధోనీ, డుప్లెసిస్లతో కలసి బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ టాస్ కాయిన్ను ఆవిష్కరిస్తారు. ఈ సిరీస్లో ప్రతీ మ్యాచ్కు ఇదే టాస్ కాయిన్ను ఉపయోగిస్తారు. గాంధీ గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఠాకూర్ చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  Mahatama Gandhi  India-South Africa cricket series  special toss coin  

Other Articles