Exchanging words not the only way to be aggressive: MS Dhoni

Exchanging words not aggression says dhoni

Mahendra Singh Dhoni Virat Kohli Ishant Sharma Dharamsala, india south africa, south africa india, india vs south africa, india south africa t20, t20 india south africa, BCCI, Mahatama Gandhi, India-South Africa cricket series, cricket, ms dhoni, rahul dravid, aggression, exchanging words, virat kohli, cricket news, cricket

India’s limited-overs captain Mahendra Singh Dhoni said “exchanging words or physical contact” was not his idea of aggression and it was imperative for his team to play within the rules.

కోహ్లీపై సందర్భోచితంగా ధోనీ విసుర్లు..

Posted: 10/02/2015 06:37 PM IST
Exchanging words not aggression says dhoni

క్రికెట్ ఆటలో దూకుడుగా ఉండాలని కానీ అది పరిమితులకు లోబడి ఉండాలని భారత క్రికెట్ వన్డే, టీ 20 సారథి ఎమ్మెస్ ధోని అన్నాడు. మాటల యుద్ధానికి దిగడం, ఒకరి మీదకు ఒకరు దూసుకెళ్లడం దూకుడు కాదన్నాడు. దూకుడు అంటే మాటకు మాట అనుకోవడం లేదా ఒకరినొకరు ఢీకొట్టుకోవడం కాదని, ఫాస్ట్‌ బౌలర్‌ వేగంగా వేసిన బంతిని చక్కటి ఫార్వర్డ్‌ డిఫెన్స్‌ ఆడి రాహుల్‌ ద్రవిడ్‌ సరైన సమాధానం చెప్పేవాడని చెప్పాడు. ఆటలో దూకుడంటే అది అన్నాడు. సంయమనంతో ఉండటం చాలా కీలకమన్నాడు.

ఈ విషయాన్ని భారత క్రికెట్ ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారన్నాడు. తన దృష్టిలో దూకుడుగా ఆడటం మంచిదే కానీ అది పరిమితులకు లోబడి ఉండాలని చెప్పాడు. అప్పుడు ఎవరిపైనా క్రమశిక్షణ చర్యలు ఉండవన్నాడు. దక్షిణాఫ్రికాపై అలాంటి పరిమితులకు లోబడిన దూకుడుతో ఆడాలని కోరుకుంటున్నానని, ఒక ఫార్మాట్‌ నుంచి మరో ఫార్మాట్‌కు మారి అలవాటు పడటం అంత సులభం కాదన్నాడు. టీ20 ఆడి టెస్టులు ఆడితే ఫర్వాలేదని, అదే టెస్టులు ఆడి టీ20 ఆడాల్సి వస్తే తొలి బంతి నుంచే భారీ షాట్లకు దిగాల్సి ఉంటుందని, కొంచెం కష్టమన్నాడు. కాగా, మైదానంలో దూకుడుగా ఉంటున్న కోహ్లీ తదితరులకు ఇది చురకలు కావొచ్చు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles