Ashes 2015: Australia captain Michael Clarke given guard of honour by England

Michael clarke receives a guard of honour from england

Australia, Cricket, David Warner, England, Guard of honour, Michael Clarke, Oval, Sports, Sports News, latest cricket News, England cricket team, Australian Team

Retiring Australian cricket captain Michael Clarke receives guard of honour from England in his final test at The Oval.

మైఖేల్ క్లార్క్ కు గౌరవంపై వార్నర్ ఖుష్..!

Posted: 08/21/2015 06:20 PM IST
Michael clarke receives a guard of honour from england

అస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్న నేపథ్యంలో యాషస్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న చివరి టెస్టులో ఆయనకు ఇంగ్లాండ్ జట్టు నుంచి అనూహ్య గౌరవం దక్కింది. మైఖేల్ క్లార్క్ కు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఇరువైపులా నిలబడి చపట్లతో అభినందనలు పలికారు. చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న మైఖేల్ క్లార్క్ కు 'గార్డ్ ఆఫ్ హానర్' తెలిపిన ఇంగ్లండ్ ఆటగాళ్లను చూసి మంత్రముగ్దుడైన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ వారిని  ప్రశంసించాడు. ఓవల్ టెస్టుతో కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్న క్లార్క్‌కు ఊహించని విధంగా గౌరవం దక్కిందన్నారు.

ఈ గౌరవానికి క్లార్క్ అన్నివిధాలా అర్హుడని వార్నర్ అన్నాడు. క్లార్క్ గొప్ప కెప్టెన్, నాయకుడు, జట్టు సభ్యుడని ప్రశంసించాడు. గత కొన్నేళ్లుగా క్లార్క్  క్రీడాజీవితంలో కెరీర్ లో భాగస్వామిని అయినందుకు గర్వపడుతున్నానని చెప్పాడు. అయితే తమ ఆటగాడు క్లార్క్ కు దక్కినట్లుగానే కొలంబో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న శ్రీలంక దిగ్గజ బ్యాట్స్ మన్ కుమార సంగక్కరకు కూడా భారత ఆటగాళ్లు ఇలాగే గౌరవించాలని తన ఆకాంక్షను వెలిబుచ్చాడు. సంగక్కరకు టీమిండియా ప్లేయర్స్ 'గార్డ్ ఆఫ్ హానర్' తెలిపితే చూడాలనుకుంటున్నామని వార్నర్ చెప్పాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Michael Clarke  Australia  England  Guard of honour  David Warner  

Other Articles