India vs Sri Lanka: Indian team gives guard of honour to retiring Sangakkara

Indian team gives guard of honour to retiring kumar sangakkara

Cricket, India vs Sri lanka, India vs Sri Lanka 2015, India vs Sri Lanka Test Series, Kumar Sangakkara, Dimuth Karunaratne, Virat Kohli

The standing ovation continued as Sangakkara walked past the guard of honour formed by the Indian team

రిటైర్ అవుతున్న సంగక్కరకు టీమిండియా గౌరవ వందనం

Posted: 08/21/2015 06:17 PM IST
Indian team gives guard of honour to retiring kumar sangakkara

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్న శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరకు టీమిండియా ఆటగాళ్లు గౌరవ వందనం పలికారు. భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండవ రోజన కుమార సంగక్కర బ్యాటింగ్ చేసేందుకు వస్తున్న క్రమంలో కొలంబో స్టేడియం చప్పట్లతో మార్మోగింది. కొలంబోలోని పి సారా ఓవల్ మైదానంలోకి అడుగుపెట్టగానే టీమిండియా ఆటగాళ్లు రెండు వైపులా లైన్‌లో నుంచొని చప్పట్లతో స్వాగతం పలుకుతూ గార్డ్ అఫ్ హానర్ (గౌరవ వందనాన్ని)  పలికారు. 37ఏళ్ల కుమార సంగక్కర ఈ రెండో టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నారు. ఈ నేపథ్యంలో కుమార సంగక్కర క్రీజులోకి అడుపెట్టేందుకు మైదానంలోకి రాగానే ప్రేక్షకులు లేచి నిలబడి తమ హర్షధ్వానాలతో సంగక్కర బ్యాటింగ్‌కు స్వాగతం పలికారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కరచాలనంతో సంగక్కరకు అభినందనలు తెలిపారు.

తన కెరీర్‌లో చివరి టెస్టు అయిన 134వ టెస్టు అడుతున్న కుమార సంగక్కర మోడ్రన్ క్రికెట్‌లో ఉన్న అతి కొద్ది గొప్ప బ్యాట్స్ మెన్లలో ఒకడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్న శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర‌ను బీసీసీఐ కూడా నిన్న సన్మానించింది. బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ సంగక్కరకు జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. టెస్టు క్రికెట్‌లో కుమార సంగక్కర 57.71 సగటుతో 12,350 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 38 సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 404 వన్డేలు ఆడిన సంగక్కర 41.98 సగటుతో 14, 234 పరుగులు సాధించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  srilanka  kumara sangakkara  guard of honour  

Other Articles